జాతీయ వార్తలు

‘వ్యాపం కుంభకోణం’ కేసులో కేంద్రానికి, గవర్నర్‌కు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: వ్యాపం కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేశ్ యాదవ్‌ను ఆ పదవిలోనుంచి తొలగించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆయనను, కేంద్ర ప్రభుత్వాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే పదవిలో ఉండగా అవినీతితో సంబంధం ఉన్నట్లు అభియోగాలు నమోదయిన గవర్నర్లను తొలగించడానికి మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆదేశించాలని కూడా పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని న్యాయమూర్తులు శివకీర్తి సింగ్, అమితవ రాయ్ సభ్యులుగా గల సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి, రాంనరేశ్ యాదవ్‌కు నోటీసులు జారీ చేసింది. సామాజిక కార్యకర్త సంజయ్ శుక్లా ఈ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపం కుంభకోణం కేసును ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
రాంనరేశ్ యాదవ్‌ను గవర్నర్ పదవిలోనుంచి తొలగించాలని కోరుతూ గతంలో దాఖలయిన ఇలాంటి పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కొంతమంది న్యాయవాదుల బృందం గతంలో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో రాంనరేశ్ యాదవ్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కూడా వారు తమ పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.