జాతీయ వార్తలు

గాలి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 20: కర్నాటకలో బేలెకెరె రేవునుంచి ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో గనుల వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డిని శుక్రవారం లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. ఇనుప ఖనిజం ఎగుమతికి సంబంధించి చోటుచేసుకున్న అక్రమాల్లో గాలి కంపెనీ ప్రమేయం ఉన్నట్టు లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు విభాగం ఆరోపణ. ఇంతకు ముందు గనుల అక్రమ తవ్వకం కేసుల్లో అరెస్టయిన జనార్దన్‌రెడ్డి చాలాకాలం జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఖనిజం ఎగుమతి కేసులో విచారించే నిమిత్తం కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు విభాగం పోలీసులు అరెస్టు చేసినట్టు లోకాయుక్త సిట్ ఐజి కెఎస్‌ఆర్ చరణ్‌రెడ్డి వెల్లడించారు. గాలికి చెందిన బ్లాక్ గోల్డ్ ఐరన్ ఓర్ మైన్స్, మినరల్స్ కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్టు ఆయన స్పష్టం చేశారు. ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా కేసులో ఆయనను అరెస్టు చేశామన్నారు. ప్రజాప్రతినిధిగా తన అధికారాలను అడ్డుపెట్టుకుని మోసానికి పాల్పడినట్టు ఐజి తెలిపారు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో అరెస్టయిన గాలి జనార్దన్‌రెడ్డికి జనవరి 20న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్నాటకలోని బళ్లారి రిజర్వ్ ఫారెస్టు ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో జనార్దన్‌రెడ్డి అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు. 2011 సెప్టెంబర్ 5న గాలిని అరెస్టు చేసి హైదరాబాద్ జైలుకు తరలించారు.