S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/11/2020 - 23:35

ముంబయి, ఫిబ్రవరి 11: మహారాష్టలో మొన్నటి వరకు మిత్రపక్షాలుగా కొనసాగి, తాజాగా శతృ పక్షాలైన అధికార శివసేన, ప్రతిపక్ష బీజేపీ ఇప్పుడు పేద ప్రజలను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఆకలితో అలమటించే పేద ప్రజలకు తమ ప్రభుత్వం పసందైన భోజనం పెడుతుందని లోగడ ప్రకటించిన శివసేన సంకీర్ణ ప్రభుత్వం, చెప్పినట్లుగానే గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజున రూ.10కే థాలీని (్భజనం) అందుబాటులోకి తెచ్చింది.

02/11/2020 - 22:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల మూలంగా దేశం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు ముందుకు సాగుతోందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంపై విమర్శలు గుప్పించారు.

02/11/2020 - 22:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊహించని ‘షాక్’ తగిలిందనే చెప్పాలి. షీలాదీక్షిత్ నేతృత్వంలో 15 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా దేశ రాజధానిని ఏలిన కాంగ్రెస్‌కు రెండోసారి కూడా చావుదెబ్బ తప్పలేదు. ‘తాను గెలవలేకపోయినా ఫరవాలేదు.. పక్కవాడు ఓడిపోతే చాలు’ అన్న చందంగా బీజేపీకి అధికారం దక్కలేదన్న సంతోషంతో కాంగ్రెస్ సరిపెట్టుకొనే పరిస్థితి ఏర్పడడం గమనార్హం.

02/11/2020 - 22:50

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి ఘన విజయం సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీ గుర్తు చీపురు. ఆ చీపురును పూలతో అలంకరించి ఆప్ కార్యకర్తలు తమ ఆనందాన్ని చాటుకున్నారు

02/11/2020 - 05:36

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014-15 సంవత్సరంలో మిగులు రెవెన్యూ ఉన్న తెలంగాణకు ఆ తరువాత క్రమంగా అప్పులు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడించారు.

02/11/2020 - 04:43

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరద పథకానికి 19205 కోట్ల రూపాయలు, మిషన్ కాకతీయకు ఐదు వేల కోట్లు, రెండింటికి కలిపి మొత్తం 24,205 కోట్లు కేటాయించాలని లోకసభలో తెలంగాణ రాష్ట్ర సమితి పక్షం నాయకుడు నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

02/11/2020 - 04:41

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 18 జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులను చేపట్టినట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వై.సి.పి పక్షం నాయకుడు విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు గడ్కరీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు.

02/11/2020 - 04:38

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఉద్యోగాలలో రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదంటూ సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలన జరుపుతోంది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం సముచిత నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ప్రకటించారు.

02/11/2020 - 01:46

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా విద్యార్థులు, ప్రజలు తలపెట్టిన ర్యాలీ స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. జామియా విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు చెందిన జామియా కోఆర్డినేషన్ కమిటీ (జేసీసీ) ఆధ్వర్యంలో సీఏఏను వ్యతిరేకిస్తూ జామియా నుంచి పార్లమెంట్ వరకు సోమవారం ప్రదర్శన తలపెట్టారు.

02/11/2020 - 01:43

*చిత్రం... ఇజ్రాయిల్ జాతీయ భద్రతా సలహాదారు బెన్ షాబత్ సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న దృశ్యం

Pages