S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/17/2019 - 13:18

న్యూఢిల్లీ: ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకా పలు రాష్ట్రాల్లో మంగళవారంనాడు భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీ వాతావరణ శాఖ వెల్లడించింది.

09/17/2019 - 13:16

న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ ప్రధానులు మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌లను త్వరలో కలుసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రెండు ఆసియా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని ఆయన అన్నారు. వైట్‌హౌస్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలో మోదీని, ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ సమావేశాల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీకానున్నట్లు తెలిపారు.

09/17/2019 - 13:15

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో మాయవతికి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇపుడు బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరటంతో ఇపుడు కాంగ్రెస్‌కు సొంతంగా మద్దతు లభించినట్లయింది.

09/17/2019 - 13:14

వారణాసి: మోదీ జన్మదినం సందర్భంగా వారణాసిలో అర్వింద్ సింగ్ అనే అభిమాని హనుమాన్ దేవాలయంలో బంగారు కిరీటాన్ని సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. మోదీ రెండవ సారి అధికారంలోకి వస్తే బంగారు కిరీటాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ కిరీటం బరువు 1.25 కిలోల బరువు ఉన్నదని తెలిపారు. గత 75 సంవత్సరాలలో జరగని అభివృద్ధి మోదీ హయాంలో జరిగిందని ఆ వీరాభిమాని పేర్కొన్నారు.

09/17/2019 - 13:10

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పుట్టిన రోజును సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో జరుపుకున్నారు. ఈ రోజు ఆయన 69వ సంవత్సరంలో అడుగుపెట్టారు. నిన్న రాత్రే గుజరాత్ చేరుకున్న ఆయన ఈ ఉదయం గాంధీ నగర్ నుంచి కేవడియా వెళ్లారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. జంగిల్ సఫారీ పార్క్, సర్దార్ సరోవర్ డ్యామ్‌ను సందర్శించారు.

09/17/2019 - 05:24

న్యూఢిల్లీ : కాశ్మీర్‌లో పరిస్థితులు తెలుసుకోడానికి అవసరమేతే తానే అక్కడికి వెళ్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు విచారించింది. ‘ప్రజలు న్యాయస్థానానికి వెళ్లడానికే ఇబ్బంది పడుతున్నారంటే, తీవ్రమైన విషయమే.

09/17/2019 - 04:51

బెంగళూరు/చెన్నై, సెప్టెంబర్ 16: హిందీని జాతీయ భాషగా అమలు చేయాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన రోజుకో రకమైన రీతిలో తీవ్ర ప్రతిస్పందనలకు దారితీస్తోంది. హిందీని బలవంతంగా రుద్దితే అంగీకరించేది లేదంటూ అనేక రాష్ట్రాలు ఒకదాని తర్వాత మరొకటి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూనే వస్తున్నాయి.

09/17/2019 - 04:40

*చిత్రం... ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో తాను ఎంపీగా ఉన్నపుడు ప్రారంభించిన ఓ చేతి వృత్తుల శిక్షణా కేంద్రం శిథిలావస్థకు చేరుకుందన్న విషయాన్ని చూపిస్తున్న బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద

09/17/2019 - 04:39

కోల్‌కతా, సెప్టెంబర్ 16: ‘ఒకే జాతి.. ఒకే భాష’ పేరుతో బలవంతంగా హిందీని దేశ ప్రజలపై రుద్దేందుకు హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలను దాదాపు 50మందికి పైగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ‘అన్ని భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి’, ‘కేవలం ఒక్క భాషను ప్రజలపై రుద్దేందుకు చేసే ప్రయత్నాలను వ్యతిరేకించాలి’ అని సామాజిక మాధ్యమాల్లో ఫేస్‌బుక్ వేదికగా వీరు సోమవారం పిలుపునిచ్చారు.

09/17/2019 - 04:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులకు సంబంధించిన నివేదికలను వారం రోజుల్లోగా సమర్పించాలని కేంద్ర పర్యావరణ శాఖను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, అభ్యంతరాలుంటే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదికను సమర్పించాలని ఆ రాష్ట్రాన్ని ఎన్జీటీ కోరింది.

Pages