S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/06/2020 - 23:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రధాన మంత్రిని ఆరు నెలల్లో అధిగమిస్తానంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నరేంద్ర మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేసి అందరినీ నవ్వించారు. నరేంద్ర మోదీ గురువారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ ‘నన్ను ఆరు నెలల్లో అధిగమిస్తానని ఒక నాయకుడు ప్రకటించారు..

02/06/2020 - 23:47

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మాతృ పార్టీ నుంచి ఇతర పార్టీలకు ఫిరాయించే అనైతిక ధోరణికి స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతో ఉందని,దీనికి ఓ పరిష్కారాన్ని కనుగొనాలని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు గురువారం కేంద్ర ప్రభుత్వానికి కోరారు. జీరో అవర్‌లో ఫిరాయింపుల అంశాన్ని డిఎంకె సభ్యుడు విల్సన్ ప్రస్తావించిన సందర్భంగా వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

02/06/2020 - 23:46

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6:దిగజారుతున్న వృద్ధి రేటును నిలబెట్టడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గురువారం లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా విపక్షాలు తీవ్ర పదజాలంతో దుయ్యబట్టాయి. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్నా, ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతున్నా కేంద్రానికి ఎంత మాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తాయి.

02/06/2020 - 23:44

అయోధ్య, ఫిబ్రవరి 6: రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో ముస్లిం కక్షిదారులు గురువారం నాడిక్కడ మసీదు పునర్నిర్మాణానికి కేటాయించిన స్థలం అయోధ్య నగరానికి చాలా దూరంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

02/06/2020 - 21:55

ముంబయి: నిరసన ప్రదర్శనల్లో పిల్లలను అనుమతించవద్దని, ఈ దిశగా స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేయాలని బ్రేవరీ అవార్డు విన్నర్ జెన్ సదావర్తే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేకు విజ్ఞప్తి చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జనవరి 30వ తేదీన జరిగిన ప్రదర్శనలో నాలుగేళ్ల మహమ్మద్ జహాన్ మృతి చెందిన విషయాన్ని ఆమె ఈ లేఖలో ప్రస్తావించింది.

02/06/2020 - 21:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తదితర సంక్షేమ పథకాలను నిలిపి వేయించేందుకు నిజామామాద్ బీజేపీ ఎంపీ డీ.అరవింద్ కుట్ర చేస్తున్నారని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షం నాయకుడు నామా నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, ఎంపీలు బండా ప్రకాశ్, జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆరోపించారు.

02/06/2020 - 21:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రధాని నరేంద్ర మోదీ పేద మహిళల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణం పథకాన్ని అమలు చేయకుండా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అక్రమాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ డి.అరవింద్ ఆరోపించారు.

02/06/2020 - 06:02

లక్నో: ఐదేళ్ళలో రూ.35 వేల కోట్ల (5 బిలియన్ల) రక్షణ ఆయుధాల ఎగుమతులు చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

02/06/2020 - 05:57

లక్నో: నలభైకి పైగా దేశాలు పాల్గొన్న డిఫెన్స్ ఎక్స్‌పోకు చైనా గైర్హాజరైంది. ఆయుధాల ప్రదర్శనకు సంబంధించిన ఈ ఎక్స్‌పోలో పాల్గొనపోవడానికి తమ దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రధాన కారణమని చైనా ఒక అధికార ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ ప్రదర్శనలో 172 మిలటరీ ఉత్పత్తుల కంపెనీలు తమ తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచాయి.

02/06/2020 - 05:55

లక్నో, ఫిబ్రవరి 5: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం పలు దేశాల మంత్రులతో సమావేశమై, చర్చలు జరుపుతూ బిజీబిజీగా గడిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, మాల్దీవులు, కిర్గిస్తాన్, ఒమన్ దేశాల రక్షణ శాఖ మంత్రులతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. బ్రిటీష్ రక్షణ విభాగం సేకరణ మంత్రి జేమ్స్ హీపేతో భేటీ అనంతరం ఇరు దేశాల మైత్రీ సంబంధాలపై రాజ్‌నాథ్ ప్రస్తావించారు.

Pages