S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/16/2019 - 02:23

చెన్నై, సెప్టెంబర్ 15: దేశవ్యాప్తంగా హిందీ భాషను అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ విమర్శించారు. ఇలాంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

09/16/2019 - 02:30

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: స్థూలార్థిక శాస్త్రంలో గట్టి పట్టున్న వారు మాత్రమే ప్రస్తుత సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించగలుగుతారని భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలను తరచుగా విమర్శిస్తూ వచ్చిన సుబ్రమణియన్ స్వామి తాజాగా ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి ఈ రోజు అనుభవజ్ఞులయిన రాజకీయవేత్తలు, నిపుణులతో కూడిన బృందం అవసరం ఉంది.

09/16/2019 - 02:19

శ్రీనగర్, సెప్టెంబర్ 15: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసినప్పటి నుంచి అక్కడ ప్రశాంత వాతావరణం కొనసాగుతోందనీ.. వ్యాపార, వాణిజ్య సముదాయాలు సక్రమంగా పనిచేస్తున్నాయనీ.. స్కూళ్లు, కళాశాలలు తెరుస్తున్నారనీ.. కార్యాలయాలకు సైతం ఉద్యోగులు బాగానే హాజరౌతున్నారని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ అక్కడ విభిన్న వాతావరణం కొనసాగుతున్నట్లు సమాచారం.

09/16/2019 - 02:19

బల్లియ, సెప్టెంబర్ 15: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రవర్తనను, అసభ్యంగా మాట్లాడుతున్న భాషను వెంటనే మార్చుకోవాలని ఉత్తర్ ప్రదేశ్‌లోని బైరియా అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ హెచ్చరించారు. లేనిపక్షంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరించారు.

09/16/2019 - 02:11

లక్నో, సెప్టెంబర్ 15: దేశంలో ఉపాధి అవకాశాలకు కొదవ లేదని, అయితే ఉత్తర భారతానికి సంబంధించినంత వరకు ఖాళీలను భర్తీ చేయడానికి ‘అర్హులైన’ వ్యక్తుల కొరత తీవ్రంగా ఉందని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ అన్నారు. అనేక భారతీయ కంపెనీల నుంచి ఉత్తర భారతానికి సంబంధించి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయని ఆయన అన్నారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

09/16/2019 - 02:09

*చిత్రం...ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో (ఆర్‌సీఈపీ) భారత్ చేరడానికి నిరసనగా ఆదివారం అమృత్‌సర్-ఢిల్లీ హైవేపై బైఠాయించిన పంజాబ్ రైతులు

09/16/2019 - 01:56

ఆగ్రాలోని పాలరాతి కట్టడం తాజ్‌మహల్‌ను సతీసమేతంగా సందర్శించిన న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ. అనంతరం ఇలా ఆ సౌధం ముందు ఫోజిచ్చారు.

09/16/2019 - 01:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: నిన్నటి తరం నుంచి నేటి తరం వరకు ప్రేక్షకులను అలరిస్తూ.. విశ్వసనీయతకు మారుపేరుగా నిలు స్తూ వస్తున్న దూరదర్శన్ ఆవిర్భవించి ఆదివారానికి సరిగ్గా 60 ఏళ్లు పూర్తయింది. మహాభారత్, ఫాజీ, మాల్గుడి డేస్ వంటి విఖ్యాత సీరియళ్లతో దేశ ప్రజలను అలరించిన దూరదర్శన్ 60ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

09/16/2019 - 01:49

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటం నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం పాకిస్తాన్‌ను హెచ్చరించింది. విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. 2003లో రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తు.చ.

09/16/2019 - 00:10

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘోర పడవ ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాహ్యాళికి వెళుతున్న వ్యక్తులు ఈ ప్రమాదానికి గురి కావడం తనను ఎంతో బాధించిందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన చోట సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.

Pages