-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, మార్చి 14: దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 84కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఈ వైరస్ సోకినట్టుగా ఆసుపత్రుల్లో చేరిన ఏడుగురిని పరీక్షల అనంతరం డిశ్చార్జి చేసినట్టు తెలిపింది. వీరిలో ఐదుగురు యూపీకి చెందినవారు కాగా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన ఒక్కొక్కరు ఉన్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
న్యూఢిల్లీ, మార్చి 14: జర్నలిజంలో విశేష ప్రతిభ కనబరచిన మహిళా జర్నలిస్టులకు ఇచ్చే చమేలి దేవి జైన్ అవార్డును అర్ఫా ఖానుమ్ షేర్వాని, రోహిణి మోహన్ అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఈ సంవత్సరం సంయుక్తంగా సాధించుకున్నారు. షేర్వాని ‘ద వైర్’ కోసం పనిచేస్తుండగా, బెంగళూరుకు చెందిన రోహిణి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
అయోధ్య, మార్చి 14: అయోధ్యలోని రామజన్మభూమి ఆవరణలో వచ్చే నెలలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ‘హారతి’ కార్యక్రమంలో తొలిసారి భక్తులు పాల్గొనడానికి అనుమతించనున్నారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఆలయం నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి రామ్‌లల్లా విగ్రహాలను తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ, మార్చి 15: రోజురోజుకూ జఠిలంగా మారుతున్న కరోనా వైరస్‌పై సార్క్ దేశాలు సంయుక్తంగా సమర శంఖం పూరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం సార్క్ సభ్య దేశాలను ఉద్దేశించి వీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన ఈ వైరస్‌పై పోరాటానికి ‘కోవిడ్-19 ఎమర్జెన్సీ నిధి’ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం భారత్ తరఫున 10 మిలియన్ డాలర్లను ప్రారంభంగా అందిస్తామని ప్రకటించారు.
న్యూఢిల్లీ: ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంతో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. కోవిడ్-19 వైరస్‌ను అడ్డుకునేందుకు కేంద్రం ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను ప్రధాని మోదీ జాతికి వివరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఆధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు.
ముంబయి, మార్చి 14: ముంబయి తీరంలో శనివారం ఒక పెను విషాదం తప్పిపోయింది. ముంబయికి సమీపంలోని మాండ్వా తీరంలో సముద్రంలో 88 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక నౌక ఒక ‘రాళ్ల ప్యాచ్’ను ఢీకొని బోల్తాపడింది. దీంతో నౌకలోకి నీరు చేరడం మొదలయింది. ఫలితంగా నౌక మునగడం కూడా మొదలయింది. మహిళలు, పిల్లలు సహా నౌకలో ఉన్న ప్రయాణికులు అరవడం మొదలు పెట్టారు. నౌకలో ఉన్న సిబ్బంది తమను కాపాడాలంటూ అధికారులను కోరారు.
బెంగళూరు, మార్చి 14: కరోనా వైరస్ ప్రభావం ఐటీ హబ్ బెంగళూరుపై తీవ్రంగా పడింది. ఐటీ నగరంలో కర్ఫ్యూ వాతావరణ కనిపించింది. శనివారం నాడు బెంగళూరులో జనం సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయింది.
రిషికేష్, మార్చి 14: వైద్య విద్యార్థులు మారుమూల ప్రాంతాల ప్రజలకు సేవలందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. రిషికేష్‌లోని ఎయిమ్స్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైద్య విద్యను పూర్తిచేసుకుని వృత్తిలోకి అడుగుపెట్టే యువత ప్రజలకు ముఖ్యమంగా మారుమూల ప్రాంతాల వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఎయిమ్స్ రెండో స్నాతకోత్సవాల్లో షా పాల్గొన్నారు.
శ్రీనగర్, మార్చి 14: ఏడు నెలల తరువాత గృహ నిర్బంధం నుంచి విడుదలయిన జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ శనివారం కలుసుకున్నారు. నిర్బంధంలో ఉన్న జమ్మూకాశ్మీర్ నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, మార్చి 14: కరోనా ప్రభావం అన్నింటిపైనా పడింది. ఈనెల 26, ఏప్రిల్ 3న జరగాల్సిన పద్మ అవార్డుల వేడుకలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ కింద మూడు కేటగిరిల్లో అవార్డులు ఇస్తారు. ముందు నిర్ణయించిన ప్రకారం మార్చి 26, ఏప్రిల్ 3న పద్మ అవార్డుల ప్రదానం జరగాలి.