S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/13/2020 - 00:55

న్యూఢిల్లీ, మార్చి 12: కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైరస్ వ్యాపించకుండా చూసేందుకు ప్రయాణాలు, పర్యటనలు, పెద్ద, పెద్ద సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని దేశ ప్రజలకు హితవు చెప్పారు. దేశ ప్రజలందరి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయని ప్రధాన మంత్రి తెలిపారు.

03/13/2020 - 04:59

న్యూఢిల్లీ: సుమారు 18 సంవత్సరాలు తమ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ తప్పుబట్టారు. రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలతోనే ఆయన పార్టీ మారారని వ్యాఖ్యానించారు. ‘జ్యోతిరాదిత్య మాటలకు, చేష్టలకు సంబంధం లేదు.. ఆయన మాటలే వేరుగా ఉన్నాయి.. మనసులో మరేదో ఉద్దేశం ఉంది’ అని రాహుల్ అన్నారు.

03/12/2020 - 23:50

*చిత్రం...పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతున్న బీజేపీ ఎంపీ, సినీ నటి హేమమాలిని

03/12/2020 - 23:48

ముంబయి, మార్చి 12: భారత్‌లో సైతం కరోనా ప్రభావంపై ఆందోళన తీవ్రవౌతున్న సందర్భంగా ముంబయిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం ఐసొలేషన్ వార్డులతో పాటు కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాక్రే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈమేరకు కేంద్రం నుంచి గుర్తింపు రావాల్సి ఉంటుందని సీనియర్ అధికారులు ముంబయిలో స్పష్టం చేశారు.

03/12/2020 - 05:55

జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరింతమంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అధికార కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది

03/12/2020 - 05:53

రాయ్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలపై చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ఘాటుగా స్పందించారు. ‘కాంగ్రెస్‌ను తిట్టుకుంటూ, ఆగ్రహంతో బయటకు వెళ్లిన వారు నిశ్శబ్దంగా తిరిగి పార్టీలోకి వస్తారు’అని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి బయలుదేరే ముందు స్వామి వివేకానంద విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మీడియాతో ముచ్చటించారు.

03/12/2020 - 05:50

ముంబయి, మార్చి 11: ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ బుధవారం రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ముంబయి విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. పవర్ వెంట ఎన్‌సీపీ నేతలు ఉన్నారు. ఎన్‌సీపీ నేత, మాజీ మంత్రి ఫజియాఖాన్ కూడా శరద్ పవార్‌తో పాటు నామినేషన్ దాఖలు చేస్తారని భావించారు. అయితే గురువారం ఖాన్ నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

03/12/2020 - 05:48

రాంచీ, మార్చి 11: జేఎంఎం చీఫ్ శిబూ సొరేన్ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. 73 ఏళ్ల సొరేన్ జార్ఖండ్ సచివాలయంకు వచ్చి నామినేషన్ వేశారు. ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ వెంట ఉన్నారు. మంత్రులు రామేశ్వర్ ఓరాన్, అలంగీర్ అలాం, ఇరుపార్టీల ఎమ్మెల్యేలు సచివాలయానికి తరలివచ్చారు. జార్ఘండ్ నుంచి ఆరుగురు రాజ్యసభ సభ్యులున్నారు.

03/12/2020 - 05:46

న్యూఢిల్లీ, మార్చి 11: ఆందోళనలు, నిరసనలు జరిగే సమయాల్లో కొంతమంది రోడ్లను దిగ్బంధనం చేయడాన్ని నిరోధించేందుకు ప్రత్యేక చట్టాల ప్రతిపాదన ఏదీ లేదని బుధవారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. షహీన్‌బాగ్ తరహా నిరసనలు వెల్లువెత్తినపుడు రోడ్లను దిగ్బంధనం చేయడం సహజమే.

03/12/2020 - 05:41

న్యూఢిల్లీ, మార్చి 11: ఢిల్లీ అల్లర్ల వెనక పెద్ద కుట్ర ఉన్నదని, దేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని అరాచక శక్తులు వీటిని సృష్టించాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. అల్లర్లకు బాధ్యులైన ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధ్యులైన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకునేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు పని చేస్తున్నాయని అన్నారు.

Pages