S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/15/2020 - 05:08

న్యూడిల్లీ, మార్చి 14: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గటం వలన కలిగే ప్రయోజనాన్ని వినియోగదారులకు దక్కనీయకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం తన్నుకుపోతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన మేరకు దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు.

03/15/2020 - 05:07

*చిత్రం...ముంబయిలోని జుహూ బీచ్‌లో కరోనాపై అవగాహన కలిగిస్తూ సైకత శిల్పి లక్ష్మీగౌడ్ రూపొందించిన శిల్పాన్ని చూసేందుకు తరలివస్తున్న జనం..

03/15/2020 - 01:26

భద్రాచలం టౌన్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు అలజడి రేపారు. బస్తర్ దండకారణ్యంలో శనివారం మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు బలయ్యారు. ముందుగా మందుపాతర పేల్చిన మావోయిస్టులు అనంతరం కాల్పులకు తెగబడటంతో సీఏఎఫ్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందగా ఒక సీఆర్‌పీఎఫ్ ఏఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. బస్తర్‌లోని మార్డూన్ పోలీసుస్టేషన్ పరిధిలో బోద్లీ- మల్వాహీ గ్రామాల మధ్య రహదారి నిర్మాణం చేపడుతున్నారు.

03/13/2020 - 05:17

న్యూఢిల్లీ: కమేడియన్ కునాల్ కమ్రాపై ఇండిగో,ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలు ఆంక్షలు విధించినట్టు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఓ ప్రైవేటు టీవీలో న్యూస్ యాంకరింగ్ చేస్తున్న కమ్రా ఇండిగో ఆరునెలల పాటు ప్రయాణించకుండా సంస్థ నిషేధం విధించింది. తోటి ప్రయాణికుల పట్ట అమర్యాద, అతిగా ప్రవర్తించినందుకు జనవరి 28న ఎయిర్‌లైన్స్ ఈనిర్ణయం తీసుకుంది.

03/13/2020 - 05:15

నవీ ముంబయిలో ‘ఫగ్డీ’ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో గురువారం ఉత్సవాలు నిర్వహిస్తున్న మహిళలు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఏటా ఈ ఉత్సవాన్ని జరుపుకొంటారు.

,
03/13/2020 - 05:07

ఫలానా ప్రాంతం అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా అందరినీ కరోనా వైరస్ భయపెట్టిస్తోంది. న్యూఢిల్లీ, చెన్నైల్లో మాస్కులు ధరించిన పర్యాటకులు.

03/13/2020 - 02:09

న్యూఢిల్లీ, మార్చి 12: ఎన్.పీ.ఆర్ ప్రక్రియ సందర్భంగా ప్రజల నుండి ఎలాంటి పత్రాలను కోరటం జరగదని అమిత్ షా సభలో స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పీ.ఆర్, ఎన్.ఆర్.సీ విషయంలో అసత్యాల ప్రచారం ఆపవలసిన సమయం వచ్చిందని అమిత్ షా స్పష్టం చేశారు. వీటి గురించి ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులతో చర్చించేందుకు తాను సిద్దమేనని ఆయన తెలిపారు.

03/13/2020 - 02:08

న్యూఢిల్లీ, మార్చి 12: కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని స్కూళ్లు, కాలేజీలు ఇతర విద్యా సంస్థలు సినిమా హాళ్లను ఈనెల 31వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు.

03/13/2020 - 02:07

ముంబయి, మార్చి 12: శివాజీ పార్కు పేరును ఛత్రపతి శివాజీ పార్కుగా మార్చడం పట్ల ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రాం నాయక్ హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ పేరులో పార్క్ అనే ఆంగ్ల పదం ఉందని ఆయన గుర్తు చేశారు. దాని స్థానంలోనే మరాఠీ భాషలో ఉపయోగించే ఉద్యాన్ పదాన్ని చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. దివంగత నేత వీరసావర్కర్ కూడా ఈ మార్పును హర్షిస్తారని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

03/13/2020 - 01:16

న్యూఢిల్లీ, మార్చి 12: చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని హడలె త్తిస్తున్న కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది. కరోనా వైరస్ రోజు, రోజుకు విస్తరిస్తూ తన విశృంఖలత్వాన్ని ప్రకటించుకుంటున్నందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటించింది.

Pages