జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు జవాన్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు అలజడి రేపారు. బస్తర్ దండకారణ్యంలో శనివారం మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు బలయ్యారు. ముందుగా మందుపాతర పేల్చిన మావోయిస్టులు అనంతరం కాల్పులకు తెగబడటంతో సీఏఎఫ్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందగా ఒక సీఆర్‌పీఎఫ్ ఏఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. బస్తర్‌లోని మార్డూన్ పోలీసుస్టేషన్ పరిధిలో బోద్లీ- మల్వాహీ గ్రామాల మధ్య రహదారి నిర్మాణం చేపడుతున్నారు. పహారాగా సీఆర్‌పీఎఫ్, సీఏఎఫ్, జిల్లా పోలీసులు ఉన్నారు. మావోయిస్టులు వీరిని లక్ష్యంగా చేసుకొని ముందుగా మందుపాతర పేల్చారు. ఈ ఘటనతో జవాన్లు చెల్లాచెదురైపోయాక కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో సీఏఎఫ్‌కు చెందిన ఉపేంద్ర సాహూ, దేవేంద్రసింగ్‌లు చనిపోయారు. సీఆర్‌పీఎఫ్ ఏఎస్సై రెహ్మాన్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం మావోలు జవాన్ల నుంచి రెండు
ఏకే-47 తుపాకులతో పాటు రెండు వైర్‌లెస్ సెట్లను అపహరించుకుపోయారు. మావోల దాడిలో గాయపడిన సీఆర్‌పీఎఫ్ ఏఎస్సైకు చికిత్స అందిస్తున్నారు. కాగా పారిపోయిన మావోయిస్టుల కోసం అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపిస్తున్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. కాగా 2019 జనవరి 1 నుంచి 2020 ఫిబ్రవరి 1వ తేదీ వరకు మావోయిస్టుల దాడుల్లో 25మంది జవాన్లు మృతి చెందారని, ఇదే సమయంలో పలు ఎన్‌కౌంటర్లలో ఈ కాలంలో 81మంది మావోయిస్టులు మృతి చెందారని చత్తీస్‌గఢ్ పోలీసులు పేర్కొన్నారు. ఇదే క్రమంలో 57మంది పౌరులు కూడా మృతి చెందినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయని ప్రకటించారు.