జాతీయ వార్తలు

ఇదెక్కడి అన్యాయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ, మార్చి 14: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గటం వలన కలిగే ప్రయోజనాన్ని వినియోగదారులకు దక్కనీయకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం తన్నుకుపోతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన మేరకు దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన మేరకు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించకుండా ఎక్సైజ్ పన్ను పెంచి తద్వారా ఖజానాను నింపుకోవడం అన్యాయమని మాకెన్ దుయ్యబట్టారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గటం వలన కేంద్ర ప్రభుత్వానికి మూడు లక్షల నలభై వేల కోట్ల అదనపు ఆదాయం లభించిందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు నీలేష్ స్వయంగా అంగీకరించారని ఆయన గుర్తుచేశారు. చమురు ధరలు తగ్గిన మేరకు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తే వినియోగదారులకు దాదాపు మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయల ప్రయోజనం కలిగేదని, అయితే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్ను, రోడ్డు పన్ను పెంచటం ద్వారా ప్రజలకు అందాల్సిన ప్రయోజనాన్ని తన్నుకుపోయిందని ఆయన ఆరోపించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారల్‌కు 35 డాలర్లకు తగ్గినందున ఈ మేరకు దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాలని మాకెన్ విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన మేరకు దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలి, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలన్నది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని మాకెన్ స్పష్టం చేశారు.