జాతీయ వార్తలు

కమ్రాపై నిషేధమా.. తెలియదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కమేడియన్ కునాల్ కమ్రాపై ఇండిగో,ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలు ఆంక్షలు విధించినట్టు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఓ ప్రైవేటు టీవీలో న్యూస్ యాంకరింగ్ చేస్తున్న కమ్రా ఇండిగో ఆరునెలల పాటు ప్రయాణించకుండా సంస్థ నిషేధం విధించింది. తోటి ప్రయాణికుల పట్ట అమర్యాద, అతిగా ప్రవర్తించినందుకు జనవరి 28న ఎయిర్‌లైన్స్ ఈనిర్ణయం తీసుకుంది. తరువాత నిషేధాన్ని మూడు నెలలకు తగ్గించింది. ‘కమ్రాపై నిషేధం విధించిన విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు’అని కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈమేరకు గురువారం లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ప్రసూన్ బెనర్జీ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించకుండా కునాల్ కమ్రాపై నిషేధం విధించారని ఎంపీ వివరించారు. అయితే ఓ కమేడియన్ ప్రయాణాలపై నిషేధం విషయమై చర్చ సాగింది తప్ప ఎంపీగానీ, మంత్రిగానీ కమ్రా పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. తరువాత కునాల్ కమ్రా పేరును మంత్రి పూరి ట్వీట్ చేశారు. ‘పక్కవారిని రెచ్చగొట్టేలా మాట్లాడడం, విమానంలో అల్లరి సృష్టించడం ప్రయాణికుల భద్రతకు భంగకరం. ఇదెంత మాత్రం సరైంది కాదు. అలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవు’అని మంత్రి ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా, గో-ఎయిర్, స్పైస్ జెట్, ఇండిగో విమాన సంస్థలు కునాల్ కమ్రాపై ఆంక్షలు విధించాయి. అయితే ఎంత కాలం నిషేధం విధించిందీ స్పష్టం కాలేదు. కాగా కమ్రా వ్యవహారం సంస్థ అంతరంగిక కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టు ఇండిగో సమాచారం ఇచ్చిందని పూరి లిఖిత పూర్వక సమాధానంలో చెప్పారు. విమానంలో అనుచితంగా వ్యవహరించే ప్రయాణికులపై డీజీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.

*చిత్రం... కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి వెల్లడి