S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/18/2020 - 01:43

న్యూఢిల్లీ/ముంబయి, మార్చి 17: భారత్‌లో మూడో కరోనా మృతి నమోదైంది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో 63 ఏళ్ల వ్యక్తి వైరస్‌తో మరణించాడు. మంగళవారం నాటికి దేశంలో 137 కరోనా పాజిటీవ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఐరోపా దేశాలు, టర్కీ, యూకే నుంచి భారత్‌లోకి రాకుండా నిషేధం విధించారు. మార్చి 18 నుంచి 31 వరకూ ఇది అమల్లో ఉంటుంది.

03/18/2020 - 01:39

న్యూడిల్లీ, మార్చి 17: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయటం ద్వారా రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి చేసింది, న్యాయ వ్యవస్థ స్వాతంత్రాన్ని దెబ్బ తీసిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌మను సింఘ్వి ఆరోపించారు.

03/18/2020 - 01:39

న్యూఢిల్లీ, మార్చి 17: జనాభా లెక్కల సేకరణలో భాగంగా దేశంలోని వెనుకబడిన కులాల జనాభా లెక్కలను కూడా సేకరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ.హనుమంత రావు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన కులాల వారి ప్రయోజనాలను నిజంగానే పరిరక్షించాలనుకుంటే మొదట వారి జనాభా లెక్కలను సేకరించాలని వీహెచ్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

03/17/2020 - 17:50

న్యూఢిల్లీ: ఇరాన్‌లో కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇరాన్ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను, రాజకీయ ఖైదీలతో సహా విడుదల చేయాలని నిర్ణయించారు. అంతేకాదు వారిని మళ్లీ ఎపుడు జైళ్లకు తీసుకురావాలనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. ఇరాన్‌లో కరోనా వ్యాపించి ఇప్పటికే 853మంది బలికాగా..మొత్తం 14,991 కేసులు నమోదు అయ్యాయి.

03/17/2020 - 17:50

జమ్మూకాశ్మీర్: కాశ్మీర్‌లో పార్కులు, ఉద్యానవన ప్రదేశాలను మూసివేశారు. ఇక్కడ ఇప్పటి వరకు మూడ కరోనా కేసులు నమోదు కావటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటివరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయగా తాజాగా కరోనా కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

03/17/2020 - 16:07

న్యూఢిల్లీ: దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాలను పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఇటువంటి పరిస్థితుల్లో మీడియా బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తుందని అన్నారు. ఎంపీలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.

03/17/2020 - 16:06

న్యూఢిల్లీ: తాజ్ సందర్శనను నిలిపివేశారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు దేశంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యాయామశాలలు, పురాతన కట్టడాల సందర్శన, ప్రదర్శనశాలలు, మ్యూజియంలను మూసివేస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు.

03/17/2020 - 16:06

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సరైన రీతిలో స్పందించకుంటే రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఆయన పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ సునామీ వంటిదని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే దేశం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.

03/17/2020 - 13:47

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగియటంతో వారిని నియమించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2018లో సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తన పదవీకాలంలో ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు.

03/17/2020 - 13:12

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో బలపరీక్ష నిర్వహణపై బీజేపీ వేసిన పిటిషన్‌ను రేపటికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం మంగళవారం బీజేపీ నేతల పిటిషన్‌ను స్వీకరించింది. కాంగ్రెస్ తరపు నుంచి ఎవ్వరూ విచారణకు హాజరుకాకపోవటంపై విచారణను రేపు ఉదయం 10.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

Pages