జాతీయ వార్తలు
జనాభా సేకరణలో బీసీల లెక్కలూ తేల్చండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 17: జనాభా లెక్కల సేకరణలో భాగంగా దేశంలోని వెనుకబడిన కులాల జనాభా లెక్కలను కూడా సేకరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ.హనుమంత రావు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన కులాల వారి ప్రయోజనాలను నిజంగానే పరిరక్షించాలనుకుంటే మొదట వారి జనాభా లెక్కలను సేకరించాలని వీహెచ్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. దేశ జనాభాలో వెనుకబడిన వర్గాల జనాభా ఎంత అనేది స్పష్టం కానంత వరకు వారి అభివృద్ది సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మీరు కూడా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే కాబట్టి జనాభా లెక్కల సేకరణ సందర్భంగా బీసీ జనాభా లెక్కలను కూడా సేకరించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన మోదీకి విజప్తి చేశారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా బీసీల జనాభా లెక్కలు కూడా సేకరించాలని కోరుతూ నరేంద్ర మోదీకి ఒక లేఖ రాస్తున్నట్లు వీహెచ్ చెప్పారు. వెనుకబడిన కులాల జనాభా ఎంత అనేది తేల్చకుండా వారి అభివృద్ధికి కృషి చేయడం సాధ్యం కాదన్నారు. దేశంలోని కొన్ని వర్గాలు, కొందరు నాయకులు దురుద్ధేశ్యంతో వెనుకబడిన కులాలు, వర్గాల జనాభా లెక్కల సేకరణను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీసీల జనాభా ఎంత అనేది స్పష్టమైతే అధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే వారిలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ బీసీల ప్రయోజనాల పరిరక్షణ కోసం వారి జనాభా లెక్కలను సేకరించేందుకు ఆదేశాలు జారీ చేయాలని వీహెచ్ విజప్తి చేశారు.