S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/11/2020 - 01:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: వేలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న కరోనా వైరస్‌కు కేంద్రమైన చైనాలోని వూహాన్ నగరంలో చిక్కుకుపోయిన కర్నూలుకు చెందిన అనె్నం జ్యోతికి అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తున్నామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.

02/11/2020 - 01:41

గాంధీనగర్, ఫిబ్రవరి 10: దేశ ఐక్యత, సమగ్రతను గౌరవించడం అన్నది ముఖ్యమైన ప్రాథమిక విధిగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

02/11/2020 - 00:35

న్యూఢిల్లీ : ఢిల్లీ శాసన సభకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి గెలుస్తోందంటూ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? లేక బీజేపీ నాయకులు వాదిస్తున్నట్లు ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా? అనేది రేపు అంటే మంగళవారం మధ్యాహ్నానికి తేలిపోతుంది. ఢిల్లీ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభమై మధ్యాహ్నానికి ఎవరు విజేతలనేది వెలుగులోకి వస్తుంది.

02/11/2020 - 00:08

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశంలో మలేరియాను సమూలంగా నిర్మూలించేందుకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు చేతులు కలిపారు. 2030 సంవత్సరం నాటికి సమూలంగా నిర్మించాలన్న ప్రభుత్వ సంకల్పానికి తమ వంతు సహకారం అందించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీలు తెలిపారు.

02/11/2020 - 00:07

కోల్‌కతా, ఫిబ్రవరి 10: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం జనాకర్షక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఉపాధి కల్పనకు ఊతాన్నిస్తూ అనేక ప్రతిపాదనలు చేసింది. రానున్న మూడేళ్ళ కాలంలో రాష్ట్రంలో వంద ఎంఎస్‌ఎంఇ పార్కులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. త్రైమాసికంగా 75 యూనిట్లు దాటని వారికి ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తామని 2020-21 వార్షిక బడ్జెట్‌లో ప్రకటించింది.

02/10/2020 - 06:56

లక్నో: కులం, మతం ఆధారంగా వివక్ష లేని సమాజం కోసం 14వ శతాబ్దపు సాధువు రవిదాస్ కలలుగన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. సాధువు రవిదాస్ కలలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు.

02/10/2020 - 05:19

*చిత్రం... వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆదివారం సందర్శించి పూజలు నిర్వహిస్తున్న శ్రీలంక ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్స

02/10/2020 - 05:17

ఇండోర్, ఫిబ్రవరి 9: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమారుడు రాహుల్‌గాంధీపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నఖ్వీ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్ గాంధీని ‘పొలిటికల్ ప్లేస్కూల్’కు పంపండి అని సోనియా గాంధీకి సూచించారు. తద్వారా ఆయనలో హుందాతనం, మర్యాదగా మాట్లాడడం అలవడుతుందని పేర్కొన్నారు.

02/10/2020 - 05:15

ఇండోర్, ఫిబ్రవరి 9: ‘మా పార్టీలో ముస్లిం నేతలనుద్ధేశించి నో-ఎగ్జిట్, నో-ఎంట్రీ అనే బోర్డులు ఏమీ పెట్టలేదు..’ అని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. మధ్య ప్రదేశ్ బీజేపీ నుంచి ముస్లిం నాయకులు భారతీయ పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా పార్టీని వీడుతున్నారన్న ప్రచారాన్ని మంత్రి నఖ్వీ తోసిపుచ్చారు.

02/10/2020 - 05:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రాణాంతక కరోనా వైరస్ గుప్పిట చిక్కిన చైనాకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈమేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఓ లేఖ రాశారు. ఈ వైరస్ మహమ్మారిని ఎదుర్కొంటున్న చైనా ప్రభుత్వంతోను, అక్కడి ప్రజలతోనూ సంఘీభావంతో పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఈ లేఖలో మోదీ పేర్కొన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Pages