జాతీయ వార్తలు
వెంటాడుతున్న భయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 March 2020
కరోనా వైరస్ భయంతో ప్రజలు బయటకు రాకుండా తమను తామే ఇళ్లకు పరిమితం చేసుకుంటున్నారు. దీంతో షాపింగ్ మాల్స్ నుంచి సినిమా థియేటర్ల వరకు ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణమే కనిపిస్తున్నది. మన దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, పార్క్‌లు, కల్యాణ మండపాలను ఈనెలాఖరు వరకు మూసివేసిన విషయం తెలిసిందే. 250 మందికి మించి జనాలు హాజరయ్యే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.
కరోనా వైరస్ భయం భారతదేశానే్న కాకుండా యావత్ ప్రపంచాన్నీ వెంటాడుతోంది. ఎప్పుడూ జనసమ్మర్ధంగా ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసిలో కరోనా వైరస్ భయం కారణంగా యాత్రీకులు తగ్గిపోవడంతో గిరాకీ లేక బోసిపోతున్న ఘాట్లు.