జాతీయ వార్తలు
పలు రైళ్లు రద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూడిల్లీ:కరోనా ప్రభావంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా, ఇదివరకే రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వాటిని రద్దు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనిని పరిగణలోకి తీసుకున్న దక్షిణ రైల్వే ఈ నెలాఖరులోపు నడిచే పలు రైళ్లు రద్దు చేసింది. రద్దు చేసిన రైళ్లలో రిజర్వేషన్ టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు ఫోన్ మెసేజ్ ల ద్వార సమాచారం అందిస్తామని రైల్వేశాఖ అధికారులు చెప్పారు.వెస్ట్,నార్తరన్ సెంట్రల్ రైల్వేలో 11 రైళ్లు, దక్షిణ మధ్య రైల్వేలో 20, సదరన్ రైల్వేలో 32, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో 20, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 5 రైళ్లను రద్దు చేశారు. కరోనా వైరస్ లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారు రైల్వే కేటరిగంగ్ పనులు చేయకుండా చూడాలని రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.