S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/19/2019 - 04:23

న్యూఢిల్లీ, జూలై 18: అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తక్షణమే అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో జీరో అవర్‌లో పది శాతం రిజర్వేషన్ల అంశాన్ని లేవనేత్తారు.

07/19/2019 - 04:09

ప్రాణభయం... అమ్మో ఇది తల్చుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది ఎవరికైనా.. దీనికి కేవలం మనుషులు మాత్రమే అనుకొంటే మనం తప్పులో కాలేసినట్లే.. ప్రాణభయానికి కారెవరూ అనర్హులు అనడానికి కించిత్ ఉదాహరణ అస్సాం వరద బీభత్సంలో చిక్కుకొన్న జంతుజాలమే అనడంలో ఎలాంటి సందేహం లేదు..

07/19/2019 - 04:07

చిత్రం...పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్న సందర్భంగా బీజేపీ ఎంపీలు హేమమాలిని, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా

07/19/2019 - 04:02

హైదరాబాద్, జూలై 18: తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీల గెలుపు, ఓట్ల శాతంపై అసోసియేటెడ్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ పత్రాన్ని విడుదల చేసింది. 2019 ఏప్రిల్, మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 542 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం, గెలిచిన అభ్యర్థుల ఓట్ల శాతంపై సంపూర్ణంగా విశే్లషించినట్లు ఆ సంస్థ తెలిపింది. 341 మంది ఎంపీలు అంటే 63 శాతం మంది తమ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు తెచ్చుకుని గెలిచారు.

07/19/2019 - 04:01

న్యూఢిల్లీ, జూలై 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆర్థిక బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను కేంద్రానికి మరోసారి గుర్తుచేశారు.

07/19/2019 - 03:59

న్యూఢిల్లీ, జూలై 18: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించుకురావాల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులపై ఉందని తెలుగుదేశం ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. గురువారం లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో కేశినేని నాని పాల్గొన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో అప్పటి ప్రధాన మంత్రి ప్రకటించిన ప్రత్యేకహోదాను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

07/19/2019 - 03:54

న్యూఢిల్లీ, జూలై 18: పాకిస్తాన్ తన వద్ద ఉన్న మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను వెంటనే విడుదల చేయాలని భారత్ గురువారం డిమాండ్ చేసింది. కుల్‌భూషణ్ జాదవ్‌ను వెనక్కి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తానని పేర్కొంది. కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను సమీక్షించాల్సిందిగా అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్తాన్‌ను ఆదేశించిన మరుసటి రోజు భారత్ ఈ డిమాండ్ చేసింది.

07/19/2019 - 03:51

విద్యుత్ చార్జీలు అమాంతం పెంచేయడానికి నిరసనగా మధ్యప్రదేశ్ గుడిసె వాసులు గురువారం భోపాల్‌లో ధర్నాకు దిగారు. ఏకంగా విద్యుత్ బిల్లులనే ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు

07/19/2019 - 03:49

న్యూఢిల్లీ, జూలై 18: కావేరీ జలాల వివాదంపై అధికార పార్టీ సభ్యురాలు అడిగిన ప్రశ్నపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ వ్యాఖ్యలు అన్ని పార్టీల సభ్యుల్లోనూ నవ్వులు పూయించాయి. ‘అక్కడకు పోరాడండి..ఇక్కడ కాదు’అని ఓ బిర్లా అన్నారు. గురువారం లోక్‌సభలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

07/19/2019 - 03:48

న్యూఢిల్లీ, జూలై 18: చిన్నారులపై లైంగిక వేదింపులకు పాల్పడేవారికి మరణ శిక్ష విధించేందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అశ్లీల ప్రవర్తనకు ఏడేళ్ల జైలుశిక్షతోబాటు జరిమానా విధించేందుకు సైతం ఈ చట్టం వీలుకల్పిస్తుంది. ఈ తరహా నేరాలను అరికట్టే ఉద్దేశంతో శిక్షల తీవ్రతను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది.

Pages