జాతీయ వార్తలు
కోవిడ్-19పై యుద్ధం చేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: లడఖ్‌లోని ఓ సైనికుడికి కరోనా పాజిటీవ్ రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. లడఖ్‌లో ‘స్నో వారియర్స్’గా పిలిచే స్కౌట్స్ ఇన్‌ఫెంటరీ రిజిమెంట్‌కు చెందిన 34 ఏళ్ల జవానుకు వైరస్ సోకిందన్న వార్త పారామిలటరీ దళాల్లో కలకలం రేపింది.
ఇది జరిగిన కొద్ది గంటల్లోనే కేంద్రం పారామిలటరీ దళాలను అప్రమత్తం చేసింది. కోవిడ్-19పై యుద్ధానికి సన్నద్ధం కావాలని కేంద్రం పిలుపునిచ్చింది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19కు 7000 మంది చనిపోయారు. సుమారు లక్షా 70 వేల మందికి వైరస్ సోకింది. భారత్‌లో వైరస్ సోకి ముగ్గురు చనిపోయారు. 147 పాజిటీవ్ కేసులు నిర్దారణ అయ్యాయి. పారామిలటరీ దళానికి చెందిన ఓ జవానుకు కోవిడ్-19 సోకడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అతడు పనిచేస్తున్న రెజిమెంట్‌లో 800 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లోని లేహ్‌లో స్కౌట్ రెజిమెంటల్ సెంటర్ ఉంది. దేశంలో కరోనా వైరస్ విజృంభించకుండా అనేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా విధి నిర్వహణలో ఉంటున్న వైద్య సిబ్బందికే అత్యంత ప్రమాదంగా పరిణమించింది. ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్(మెడికల్) డాక్టర్ ముకేష్ సక్సేనా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ మహమ్మారితో అత్యంత ప్రమాదం వైద్య ఆరోగ్య సిబ్బందికేనని ఆయన అన్నారు.‘ ఎవరైతే వైరస్‌పై పోరాడుతున్నారో వారికే నష్టం వాటిల్లితే వైద్య వ్యవస్థే కుంటుపడుతుంది. కాబట్టి వైద్య, ఆరోగ్య సిబ్బంది బాగోగులూ చూడాల్సిన అవసరం ఉంది’అని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్-19 తీవ్రతను గుర్తించిన భారత్ అనేక జాగ్రత్తలు తీసుకుంది. జాతీయ విపత్తుల చట్టం కింద వైరస్ అదుపునకు చర్యలు చేపట్టింది. ఇప్పుడు వైరస్ పారామిలటరీ దళాల్లోకి చొచ్చుకు వచ్చిందన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని పారామిలటరీ దళాల్లో 10 లక్షల మంది పురుషులు, మహిళలు పనిచేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో వారు విధులు నిర్వర్తిస్తున్నారు. సరిహద్దులనే కాదు అత్యంత సమస్యాత్మకమైన జమ్మూకాశ్మీర్, నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాణాలకు సైతం తెగించి సేవలందిస్తున్నారు. ‘సైనికుల ఆరోగ్య పరిరక్షణ ఓ సవాల్ వంటిదే. ముఖ్యంగా బ్యారెక్‌లలో ఉంటున్న దళాల పరిస్థితి మరింత దారుణం’అని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
మరింత అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు(విమానాలు, రైళ్లు, బస్సు)కు కనీసం నెల రోజులు దూరంగా ఉండాలని కోరారు. అలాగే నాన్ ఎమర్జెన్సీ సెలవులు రద్దుచేసుకోవాలని సైనికులకు విజ్ఞప్తి చేశారు. ప్రయాణాలు తగ్గించుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. అలాగే కరచాలనాలు వద్దని, ఒకరి కొకరు కనీసం మీటర్ ఎడంగా ఉండాలని సూచించారు. తరచూ చేతులు కడుక్కోవడంతో పాటు బహిరంగ స్థలాల్లో పరిశుభ్రత పాటించాలన్నారు. బూట్లు ఇంటి బయటే వదిలి వెళ్లాలని చెప్పారు.