S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/18/2019 - 13:54

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు నేడు ప్రారంభమయ్యాయి. దివంగత నేతలకు నివాళులర్పించిన తరువాత లోకసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్‌లో ఏం జరుగుతుందని, ప్రతిపక్ష పార్టీల నేతలను హౌజ్ అరెస్టు చేసి 108 రోజులు అయిందని, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను హౌజ్ అరెస్టు చేశారని, ఆయన ఎంపీ అని, పార్లమెంటుకు రావటం రాజ్యాంగ హక్కు అని అన్నారు.

11/18/2019 - 13:51

న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తు పార్టీ చేసుకుంటున్నవారిపై ఓ గుర్తుతెలియని అగంతకుడు కాల్పులు జరిపాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కాలిఫోర్నియాలోని ఫ్రెన్స్‌కో పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇంటి వెనుక భాగంలో కొంతమంది ఫుట్‌బాల్ మ్యాచ్ చూసుకుంటూ పార్టీ చేసుకుంటున్నారు. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాల్గొన్నారు. గుర్తుతెలియని ఆగంతకుడు కాల్పులు జరపటంతో నలుగురు చనిపోయారు.

11/18/2019 - 12:51

న్యూఢిల్లీ: విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై కూలంకషంగా చర్చిస్తే ప్రజా సంక్షేమం చేకూరుతుందని అన్నారు. సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు.

11/18/2019 - 12:51

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. జాతీయ రహదారి 11పై బస్సు-ట్రక్కు ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. దాదాపు 20-25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

11/18/2019 - 13:57

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రు యూనివర్శిటీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. యూనివర్శిటీ హాస్టల్ మెస్ ఛార్జీలు పెంచాలని అధికారులు నిర్ణయం తీసుకోవటంతో విద్యార్థులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈరోజు పార్లమెంటును ముట్టడించాలని విద్యార్థులు పిలుపునివ్వటంతో పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో దాదాపు 1200 మంది పోలీసులు మోహరించారు. జేఎన్‌యూతో పాటు పార్లమెంటు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.

11/18/2019 - 12:47

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోకసభను స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, రాజ్యసభను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. తొలుత ఇటీవల మృతి చెందిన అరుణ్ జైట్లీ, జగన్నాథ్ మిశ్రా, రామ్‌జఠ్మలానీ, గురుదాస్ గుప్తా, లిబ్రా తదితరులకు నివాళులర్పించారు. కాగా ఈ పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.

11/18/2019 - 12:47

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్టప్రతి భవన్‌లో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ బోబ్డే 2021 ఏప్రిల్ 23 వరకు ఉంటారు.

11/18/2019 - 06:46

విశాఖపట్నం: భారత తీర రక్షణ దళానికి చెందిన ఆఫ్ షోర్ పెట్రోలింగ్ ఐసీజీఎస్ శౌర్య గస్తీ నౌక మూడు దేశాల సందర్శనకు బయలుదేరింది. గుడ్ విల్ విజిట్‌లో భాగంగా జకార్తా(ఇండోనేషియా), డ్రావిన్(ఆస్ట్రేలియా), సింగపూర్ దేశాల్లో తీర గస్తీ నౌక ఈ నెల 12న జకార్తాకు పయనమై వచ్చే నెల 8 వరకూ ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో వివిధ కార్యకలాపాల్లో పాలుపంచుకోనుంది.

11/18/2019 - 05:44

న్యూఢిల్లీ, నవంబర్ 17: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌టీ ఎస్పర్‌తో బ్యాంకాక్‌లో ఆదివారం ఇండో-పసిఫిక్ ప్రాంతం లో పరిస్థితి, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని మరింత పెం పొందించుకోవడం సహా వ్యూహాత్మక ప్రాముఖ్యత గల అనేక అంశాలపై చర్చలు జరిపారు.

11/18/2019 - 05:43

ముంబయి, నవంబర్ 17: శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ థాకరే తొమ్మిదో వర్ధంతిని ఇటు శివసేన నేతలతో పాటు బీజేపీ నేతలు వేర్వేరుగా నిర్వహించారు. ఆదివారం ఇక్కడి శివాజీ పార్కులో జరిగిన బాల్ థాకరే ఏడవ వర్ధంతి కార్యక్రమానికి ఇరు పార్టీల నేతలు వేర్వేరుగా విచ్చేసి నివాళులు అర్పించారు.

Pages