S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/11/2020 - 01:53

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంది. పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయగా ఆయన వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు పార్టీకి, శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు.

03/10/2020 - 04:33

దేశవ్యాప్తంగా హోలీ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ వసంతోత్సవ క్రీడలో దేశంలోని అన్ని ప్రాంతాలూ తలమునకలయ్యాయి. జైపూర్ నుంచి
కోల్‌కతా వరకు వీధులన్నీ ప్రజల ఆటపాటలతో, కేరింతలతో సరికొత్త కోలాహలాన్ని సంతరించుకున్నాయి. పరస్పరం రంగులు చల్లుకుంటూ ఈ పర్వదినాన్ని తనివితీరా ఆస్వాదించారు.
*చిత్రం...కోల్‌కతాలో హోలీ

03/10/2020 - 04:31

న్యూఢిల్లీ, మార్చి 9: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్‌ను కూడా అనుక్షణం వణికిస్తూనే ఉంది. వ్యాధిని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇందుకు కేంద్ర బలగాల సహాయాన్ని తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే..

03/10/2020 - 04:26

న్యూఢిల్లీ, మార్చి 9: అల్లర్లతో అట్టుడికిపోయిన ఈశాన్య ఢిల్లీలోని శివ్ విహార్ విధ్వంసానికి వౌన సాక్షిగా మిగిలింది. ఆ ప్రాంతమంతా సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలు హింసాత్మకంగా మారిపోయింది. అల్లర్లు, దహనాలు, దాడులకు భయపడిపోయిన ఇళ్లను వదిలి బంధువుల వద్ద తలదాచుకున్న ఈశాన్య ఢిల్లీ వాస్తులు రెండు వారాల తరువాత తిరిగి వస్తున్నారు. శిథిల ప్రాంతంగా శివ్ విహార్ సాక్షాత్కరిస్తోంది.

03/10/2020 - 04:25

భోపాల్, మార్చి 9: మధ్య ప్రదేశ్ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్ది, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని తమ రాష్ట్రం నుంచే రాజ్యసభకు పంపించాలన్న డిమాండ్ ఆ పార్టీ నేతల నుంచి పెరుగుతోంది. మరోవైపు బీజేపీ విమర్శలు కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడుతున్నది.

03/10/2020 - 04:22

ప్రపంచాన్ని కుమ్మేస్తున్న కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించాలంటూ హోలీ పర్వదినం సందర్భంగా ప్రజలు ప్రార్థనలు చేశారు. ఓపక్క రక్షిత మాస్కులు ధరిస్తూనే కరోనా వైరస్ రూపంలో ఓ అసుర దిష్టిబొమ్మను రూపొందించి దానిని దగ్ధం చేశారు. పాట్నా, ముంబయి, తిరువనంతపురం, హరిద్వార్ సహా కరోనా వైరస్ అనే కాముడి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రార్థనలు జరిపారు.

03/10/2020 - 04:11

న్యూఢిల్లీ, మార్చి 9: ఢిల్లీ అల్లర్లపై న్యాయ దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. స్వతంత్రంగా కోర్టు పర్యవేక్షణలోనే ఈ దర్యాప్తు జరగాలని, అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఢిల్లీలో అల్లర్లను రెచ్చగొట్టే రీతిలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయాలని కూడా కేంద్రాన్ని కాంగ్రెస్ కోరింది.

03/10/2020 - 04:08

కళతోనే చైతన్యం సాధ్యం. ఆ కళ ఎంత కళాత్మకంగా ఉంటే అంతగానూ చైతన్య వ్యాప్తి జరుగుతుంది. ఒక పక్క కరోనా వైరస్ భయపెడుతుంటే, మరోపక్క రంగుల పండుగ హోలీ జనంలో కొత్త ఉత్తేజం తెచ్చింది. ఈ రెండింటినీ మిలితం చేస్తూ సైకత చిత్రకారుడు మానస్‌సాహు పురి తీరంలో రూపొందించిన సందేశాత్మక సైకత శిల్పం ఇది.

03/10/2020 - 04:38

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతోపాటు అందర్నీ తక్షణమే విడుదల చేయాలని ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

03/10/2020 - 03:56

న్యూఢిల్లీ, మార్చి 9: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా కమలనాథులు రాష్ట్రంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలతో చర్చలు జరిపారు. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. బీజేపీ ఎంపీలతో విడివిడిగా సమావేశమవుతూ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టడి చేయాల్సిందిగా సూచించారు.

Pages