S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/05/2020 - 23:58

న్యూఢిల్లీ, మార్చి 5: లోక్‌సభ స్పీకర్ టేబుల్ పైనుంచి పత్రాలను లాగివేసినందుకు కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాంగ్రెస్ సభ్యులు గౌరవ్ గొగోయ్, టీఎన్ ప్రతాపన్, డీన్ కురియాకోస్, బెన్నీ బెహనమ్న్, మణిక్కం టాగోర్, రాజమోహన్ ఉన్నిథన్, గుర్జీత్ సింగ్ ఔజియాపై సస్పెన్షన్ వేటు పడింది.

03/05/2020 - 05:34

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో 2013తో పోలిస్తే 2019 సంవత్సరంలో చొరబాటు సంఘటనలు బాగా తగ్గాయనీ.. అలాగే, పౌరుల మరణాల సంఖ్య కూడా 80 శాతం తగ్గుముఖం పట్టిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. భద్రతా దళాల్లో క్షతగాత్రులైన వారి సంఖ్య కూడా 2014 నుంచి ఇప్పటి వరకు 78 శాతం తగ్గిందని మంత్రి పేర్కొన్నారు.

03/05/2020 - 05:31

జమ్మూ, మార్చి 4: సోషల్ మీడియాపై జమ్మూకాశ్మీర్‌లో గత కొన్ని నెలలుగా ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే, ఇంటర్‌నెట్ స్పీడ్‌ను మాత్రం 2-జీ స్పీడ్‌కు పరిమితం చేసింది. ఈనెల 17వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే.

03/05/2020 - 05:31

న్యూఢిల్లీ, మార్చి 4: కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి రోజు సమీక్షిస్తున్నారని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు.

03/05/2020 - 05:29

న్యూఢిల్లీ, మార్చి 4: ఇటీవలి ఢిల్లీ అల్లర్లలో చర్చ జరిగే వరకు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని కాంగ్రెస్ హెచ్చరించింది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాల్సిందేననీ.. సభలో దీనిపై చర్చ ప్రారంభించనంత వరకు సభను సజావుగా సాగనివ్వబోమని లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి బుధవారం పార్లమెంట్ వెలుపల విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు.

03/05/2020 - 05:28

న్యూఢిల్లీ, మార్చి 4:దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారులపై 29 ప్రొటోకాల్ ఉల్లంఘన ఫిర్యాదులు అందినట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2018 నుంచి ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగినట్టు ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 10 సంఘటనలు జరిగాయని, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లో నాలుగేసి సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన వివరించారు.

03/05/2020 - 05:28

న్యూఢిల్లీ, మార్చి 4: రైళ్లలో ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు యుద్ధప్రాతిపదికంగా కల్పిస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సుమారు 60 వేల మంది ప్రయాణికులు ఫస్ట్ ఎయిడ్ కోసం విజ్ఞప్తులు పంపించారని ఆయన అన్నారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాన్ని కల్పించామని అన్నారు.

03/05/2020 - 05:26

న్యూఢిల్లీ, మార్చి 4: త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో గత ఏడాది 95 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. నేవీలో 2 కేసులు, ఎయిర్‌ఫోర్స్‌లో 20 కేసులు, ఆర్మీలో 73 కేసులు నమోదైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయని లోక్‌సభలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ఓ లిఖితపూర్వక సమాధానంగా వెల్లడించారు. 2018 గణాంకాల ప్రకారం..నేవీలో 8, ఎయిర్‌ఫోర్స్‌లో 16, ఆర్మీలో 83 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయని వివరించారు.

03/05/2020 - 03:15

న్యూఢిల్లీలో కరోనా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించేందుకు సహాయపడుతున్న వైద్య సిబ్బంది. సదరు వ్యక్తిని పూర్తి రక్షణ మధ్య తరలిస్తున్నారు

03/05/2020 - 02:59

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించింది. ప్రపంచ దేశాలన్నీ ముందస్తు చర్యలు కూడా తీసుకోవాలని పేర్కొంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా ప్రాంతంలోని దేశాలు అన్నివిధాల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కరోనా వైరస్ సమస్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అది వ్యాపించకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సూచించింది.

Pages