S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/03/2020 - 04:30

న్యూఢిల్లీ, మార్చి 2: ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా అభిమానుల్లో విశేష ఆదరణతో ద్వితీయ స్థానంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను వదులుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క ట్విట్టర్‌లోనే మోదీకి 53.3 మిలియన్ మంది అభిమానులు ఉన్నారు.

03/03/2020 - 04:28

న్యూఢిల్లీ, మార్చి 2: ఢిల్లీ అల్లర్లపై పార్లమెంటులో చర్చించడానికి ప్రభుత్వం ఎంతమాత్రం సుముఖంగా లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్వరంతో ఆరోపించింది. బీజేపీకి చెందిన ఓ సభ్యుడు లోక్‌సభలో ఓ దళిత మహిళా ఎంపీపై దురుసుగా ప్రవర్తించారని తెలిపింది.

03/03/2020 - 04:27

కోల్‌కతా, మార్చి 2: ఢిల్లీలో ఇటీవల జరిగిన మత ఘర్షణలు రాజ్య ప్రోత్సాహంతో ఓ పథకం ప్రకారం జరిగిన మారణకాండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా గుజరాత్ తరహా అల్లర్లను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు.

03/03/2020 - 04:25

మిర్జాపూర్ (ఉత్తర్‌ప్రదేశ్), మార్చి 2: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు ప్రభుత్వం అంటూ ఓ పక్క గొప్పలు చెప్పుకొంటూనే రైతుల భూములను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. సరకు రవాణా కారిడార్ నిర్మాణం కోసం భూసేకరణను మిర్జాపూర్ రైతులు ఓపక్క వ్యతిరేకిస్తుండగా..

03/03/2020 - 04:00

న్యూఢిల్లీ, మార్చి 2: ఢిల్లీ అల్లర్లతో తీవ్రంగా నష్టపోయిన వారిలో అత్యవసరంగా ఆదుకోవాల్సిన వారి వివరాలు తెలియజేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను కోరారు. ఆ విధంగా తెలియజేసినట్లయితే సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా తాను సంబంధిత అధికారులను ఆదేశిస్తానని ఆయన చెప్పారు. సహాయ చర్యలను చేపట్టడంలో తాము 24/7 రోజులూ పని చేస్తున్నామని ఆయన తెలిపారు.

03/03/2020 - 03:57

ఔరంగాబాద్: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్‌ఆర్‌సీల అమలును చేపట్టగా, మహారాష్టల్రో బీజేపీ పాలిత మున్సిపల్ కౌన్సిల్ ఈ రెండింటినీ వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించింది. ఈ వార్త బీజేపీ అధినాయకత్వాన్ని కలవరపరిచింది. నేతలు అవాక్కైయ్యారు. వివరాల్లోకి వెళితే... ఔరంగాబాద్‌లోని సేలు మున్సిపల్ కౌన్సిల్ సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది.

03/03/2020 - 00:10

న్యూఢిల్లీ, మార్చి 2: ఢిల్లీ అల్లర్లపై పార్లమెంటు ఉభయ సభలు సోమవారం అట్టుడికాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, విపక్ష సభ్యుల పరస్పర తోపులాటలతో లోక్‌సభ గందరగోళమయంగా మారింది.

03/02/2020 - 05:28

కోల్‌కతా: ఉగ్రవాద అణచివేత విషయంలో కేంద్ర ప్రభుత్వం నిస్సహన వైఖరిని అనుసరిస్తోందని, ఈ జాఢ్యాన్ని పెంపొందించే వారిని క్షమించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారంనాడు ఇక్కడ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సానుకూల రక్షణ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు.

03/02/2020 - 05:24

*చిత్రం...నాగ్‌పూర్‌లో ఆదివారం ఓ సహాయ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఓ దివ్యాంగుడితో కరచాలనం చేస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే

03/02/2020 - 04:44

*చిత్రం... తమ సంప్రదాయంలో భాగంగా ఆదివారం చెన్నైలో 1,008 పాల కుండలను మోసుకొని కళావిజి అమ్మాన్ ఆలయాన్ని దర్శించుకుంటున్న భక్తులు

Pages