S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/04/2020 - 03:23

ముంబయి, మార్చి 3: అత్యాచారం కేసు పెట్టారన్న కక్షతో ఓ 29 ఏళ్ళ మహిళను, ఆమె భర్తను దుండగులు అపహరించి తీవ్రంగా కొట్టారు. మహారాష్టలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మంగళవారం అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పారు.

03/04/2020 - 03:21

కలియాగంజ్ (పశ్చిమ బెంగాల్), మార్చి 3: బంగ్లాదేశ్ నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్ నివసిస్తున్నవారంతా భారత పౌరులేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నివసిస్తూ వివిధ పార్టీలకు ఓటు గెలిపిస్తున్న మీరంతా భారత పౌరులేనని మంగళవారం ఇక్కడ జరిగిన ఓ సభలో మమత భరోసా ఇచ్చారు. బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించబోదనీ.. మీకు అండగా నేను ఉన్నాను..

03/04/2020 - 01:01

న్యూఢిల్లీ, మార్చి 3: ఢిల్లీ అల్లర్లపై మంగళవారం కూడా పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికాయి. వీటిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తక్షణమే చర్చను చేపట్టాలని ఉభ య సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దరిమిలా చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల మ ధ్య ఉభయ సభలూ అనేకమార్లు వాయిదా పడ్డాయి.

03/03/2020 - 23:25

న్యూఢిల్లీ, మార్చి 3: దేశం అభివృద్ధి చెందాలంటే శాంతి, సామరస్యం, సమైక్యత అన్నవి అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజంలో సామరస్యపూర్వక వాతావరణం పెంపొందించేందుకు క్రియాశీలకంగా కృషి చేయాలని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు.

03/03/2020 - 23:23

తమ దైనందిన విధుల్లో నిమగ్నమయ్యే మంత్రులు ఎప్పుడోగానీ పరస్పరం తటస్థపడడం సాధ్యపడదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడే కాకతాళీయంగా ఈ రకంగా ఎదురుపడడం జరుగుతుంది. మంగళవారం లోక్‌సభకు హాజరవుతూ పరస్పరం ఎదురైన కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ ఇలా ముచ్చటించుకుంటూ సాగడం కెమెరాలకు చిక్కింది

03/03/2020 - 23:21

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు. కరోనా వైరస్ భయంతో రక్షిత మాస్క్‌లు ధరించి మరీ ఈ ప్రదర్శనలో విద్యార్థులు పాల్గొన్నారు

03/03/2020 - 23:16

న్యూఢిల్లీ, మార్చి 3: తీవ్ర స్థాయిలో ఆందోళనలు రేకెత్తిస్తున్న పౌరసత్వ చట్ట వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ సుప్రీం కోర్టులో అసాధారణ రీతిలో పిటిషన్ దాఖలు చేశారు.

03/03/2020 - 23:13

న్యూఢిల్లీ, మార్చి 3: పార్లమెంట్ ప్రాంగణం.. మంగళవారం ఉదయం 9.30 గంటలు కావస్తోంది. ఒక్కసారిగా అందరిలో టెన్షన్ మొదలైంది.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సభ్యులు ఒక్కొక్కరుగా వారి వారి వాహనాలపై వస్తున్నారు.

03/03/2020 - 05:04

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచార దోషులకు ఉరి శిక్ష అమలు చేయడంలో జాప్యం జరుగుతుండడం పట్ల వ్యవస్థ వైఫల్యంగా కనిపిస్తున్నదని నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ దోషులకు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఉరి శిక్ష అమలు చేయరాదని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించడంపై ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ప్రతిస్పందించారు.

03/03/2020 - 04:31

న్యూఢిల్లీ, మార్చి 2: అంతర్జాతీయ స్థాయిలో భారతీయులు తమ ప్రతిభా సంపత్తులను విభిన్న కోణాల్లో చాటి చెబుతున్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం నాడిక్కడ జరిగిన సదస్సులో స్పష్టం చేశారు. చారిత్రక వైరుధ్యాలను అధిగమించి భారత్ సరికొత్త రీతిలో తమ సత్తాను చాటుకోవడం వల్లే అంతర్జాతీయ వేదికలపై మరింత క్రియాశీలకంగా వ్యవహారించడానికి దారులు తెరుచుకున్నాయని ఆయన తెలిపారు.

Pages