జాతీయ వార్తలు

త్రివిధ దళాల్లో 95 ఆత్మహత్య కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో గత ఏడాది 95 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. నేవీలో 2 కేసులు, ఎయిర్‌ఫోర్స్‌లో 20 కేసులు, ఆర్మీలో 73 కేసులు నమోదైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయని లోక్‌సభలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ఓ లిఖితపూర్వక సమాధానంగా వెల్లడించారు. 2018 గణాంకాల ప్రకారం..నేవీలో 8, ఎయిర్‌ఫోర్స్‌లో 16, ఆర్మీలో 83 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయని వివరించారు. 2006 నుంచి డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ (డీఐపీఆర్) పలు అధ్యయనాలు నిర్వహించి సమాచారం సేకరిస్తోందని ఆయన అన్నారు. 2017లో నేవీలో 2, ఎయిర్‌ఫోర్స్‌లో 21, ఆర్మీలో 77 చొప్పున కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. త్రివిధ దళాల్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నవారి మానసిక పరిస్థితిపై డీఐపీఆర్ అధ్యయనం చేసి, ఒత్తిడి తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదిస్తున్నదని ఆయన అన్నారు. ఇలావుంటే, భారత సాయుధ దళాల్లో 9,449 మంది మహిళలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. నేవీలో 625 మంది, ఎయిర్‌ఫోర్స్‌లో 1,872 మంది, ఆర్మీలో 6,892 మంది ఉన్నారని లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి వివరించారు. ఎయిర్‌ఫోర్స్‌లో ఈ ఏడాది తాజాగా మహిళలను నియమించలేదని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్ కవ్వింపు చర్యలు
పాకిస్తాన్ పలు సందర్భాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నదని, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)తోపాటు దేశ సరిహద్దులో కూడా యథేచ్ఛగా కాల్పులకు తెగబడుతోందని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాలను పాకిస్తాన్ ఉల్లంఘిస్తున్నదని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 646 పర్యాయాలు పాకిస్తాన్ ఈ విధంగా కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పొడిచిందని అన్నారు. సరిహద్దులో కాల్పులకు తెగబడుతున్నదని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులతో 27 ఎదురుకాల్పుల సంఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. గత ఐదేళ్లకాలంలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.