S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/06/2020 - 06:39

న్యూఢిల్లీ, మార్చి 5: మునిగిపోతున్న టైటానిక్ నౌక కెప్టెన్ చివరిక్షణం వరకూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రయాణికులకు భరోసా ఇస్తూ వచ్చారని, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ కూడా అనే రీతిలో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ పూర్తి స్థాయిలో అదుపులో ఉందని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.

03/06/2020 - 06:33

న్యూఢిల్లీ, మార్చి 5: కరోనా వైరస్ వ్యాపిస్తున్నదన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు ఈనెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. పిల్లలకు ఈ వ్యాధి తొందరగా సోకుతుందని, అందుకు ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. భారత్‌లో ఇప్పటివరకు 30 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో 16 మంది ఇటలీ టూరిస్టులు.

03/06/2020 - 01:09

జమ్మూ, మార్చి 5: జమ్మూలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి ఐసొలేషన్ వార్డులో ఉన్న ఇద్దరు కరోనా అనుమానితులు పరారయ్యారు. ఎట్టకేలకు వారిని వెతికి పట్టుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకొన్నారు. ఆసుపత్రి అధికారుల కథనం మేరకు..

03/06/2020 - 01:07

న్యూఢిల్లీ, మార్చి 5: పోలీస్ శాఖతోనే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమవుతుందని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువ పోలీస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. చట్టాలు సక్రమంగా అమలైతేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందని లేకపోతే అసలు ఆ పదానికి అర్థమే ఉండదని అన్నారు.

03/06/2020 - 01:06

న్యూఢిల్లీ, మార్చి 5: ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు ఏర్పాటు చేసిన సహాయక శిబిరాన్ని కరోనా భయం కుదిపేస్తున్నది. విధ్వంసాల కారణంగా ఆస్తులు, ఇళ్లు కోల్పోయిన వందలాది మంది బాధితులు ఈ శిబిరంలో తలదాచుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పారిశుధ్య సౌకర్యాలు సక్రమంగా లేవు. వైద్య శిబిరం కూడా అందుబాటులో లేదు.

03/06/2020 - 01:05

న్యూఢిల్లీ, మార్చి 5: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, యునైటెడ్ కింగ్‌డమ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి నిగెల్ ఆడమ్స్ ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత సున్నితమైన సమయంలో ఇలాంటి ప్రకటన చేయడం సమంజం కాదని హితవు పలికింది.

03/06/2020 - 01:03

న్యూఢిల్లీ, మార్చి 5: ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న మత ఘర్షణల్లో మృతుల సంఖ్య 53కు చేరింది. గత ఆదివారం సీఏఏకు వ్యతిరేకంగా కొంతమంది చేపట్టిన ఆందోళన మత ఘర్షణలుగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. అల్లరి మూకలు యథేచ్ఛగా లూటీలకు పాల్పడ్డారు. గృహాలను, వాహనాలను తగులబెట్టారు. విచక్షణారహితంగా దాడులు చేయడంతో కొంతమంది మృతి చెందారు. మరికొంతమందిని కాల్చి చంపిన సంఘటన కూడా చోటుచేసుకుంది.

03/06/2020 - 01:02

లక్నో, మార్చి 5: అయోధ్యలో మసీదు నిర్మాణంపై ట్రస్టు బోర్డును హోలీ తరువాత ప్రకటిస్తామని సున్నీ వక్ఫ్ బోర్డు గురువారం ఇక్కడ స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫరూఖీ జమ్మూలో ఈ విషయాన్ని విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు.

03/06/2020 - 01:02

న్యూఢిల్లీ, మార్చి 5: హోలీ సందర్భంగా వారం రోజుల పాటు అత్యవసర కేసులు విచారించేందుకు సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్‌ను ఏర్పాటు చేయనుంది. సుప్రీం కోర్టుకు ఈనెల 9 నుంచి 14 వరకూ హోలీ సెలవు లు. ఆ వారం రోజులూ అత్యవసర కేసులు విచారించేందుకు వెకేషన్ బెంచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే గురువారం వెల్లడించారు.

03/06/2020 - 01:00

న్యూఢిల్లీ, మార్చి 5: దేశంలోని యావత్ మహిళాలోకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. అన్ని రంగాల్లో మహిళలు అగ్రగామిగా నిలుస్తూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారని గురువారం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చే మహిళలే తనకు స్ఫూర్తి ప్రదాతలనీ.. భారత్‌ను మహిళా శక్తే నడిపిస్తోందని కొనియాడారు. ‘మహిళా పారిశ్రామికవేత్తలు స్ఫూర్తి ప్రదాతలు..

Pages