జాతీయ వార్తలు

ముస్త్ఫాబాద్ శిబిరంలో కరోనా భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు ఏర్పాటు చేసిన సహాయక శిబిరాన్ని కరోనా భయం కుదిపేస్తున్నది. విధ్వంసాల కారణంగా ఆస్తులు, ఇళ్లు కోల్పోయిన వందలాది మంది బాధితులు ఈ శిబిరంలో తలదాచుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పారిశుధ్య సౌకర్యాలు సక్రమంగా లేవు. వైద్య శిబిరం కూడా అందుబాటులో లేదు. దీంతో కరోనా వైరస్ చాలా త్వరగా ఇక్కడ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన శిబిరంలోని వారిని వేధిస్తున్నది. మానసికంగా కుంగిపోయిన వీరు ఇప్పుడు సరికొత్త సమస్యతో భయాందోళనకు గురవుతున్నారు. ఈ శిబిరంలో ఉన్నవారిలో పిల్లలు, వృద్ధుల సంఖ్య ఎక్కువ. వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మందుల కొరత తీవ్రంగా ఉంది. మాస్క్‌లు, శానిటైజర్లు అసలు అందుబాటులో లేవు. వైద్యులు, ఇతర సిబ్బంది చాలా తక్కువగా ఉండడంతో ఆరోగ్యానికి సంబంధించిన చర్యలు సక్రమంగా లేవు. వలంటీర్లు కొంతవరకు కృషి చేస్తున్నప్పటికీ శిబిరంలో తలదాచుకుంటున్నవారికి పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని శిబిరంలో తలదాచుకుంటున్నవారు కోరుతున్నారు.