జాతీయ వార్తలు

టైటానిక్ కెప్టెన్ హర్షవర్దన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: మునిగిపోతున్న టైటానిక్ నౌక కెప్టెన్ చివరిక్షణం వరకూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రయాణికులకు భరోసా ఇస్తూ వచ్చారని, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ కూడా అనే రీతిలో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ పూర్తి స్థాయిలో అదుపులో ఉందని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో హర్షవర్దన్ కరోనా వైరస్‌పై చేస్తున్న ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని రాహుల్ ధ్వజమెత్తారు. ‘కరోనా వైరస్ పూర్తి అదుపులో ఉందని హర్షవర్దన్ అంటున్నారు. ఇది ఎలా ఉందంటే టైటానిక్ నౌక కెప్టెన్ అందులోని ప్రయాణికులకు భయపడవద్దని చెబుతున్నట్టుగా ఉంది. నౌక మునిగిపోదని కెప్టెన్ హామీ ఇచ్చిన రీతిలో హర్షవర్దన్ కూడా కరోనా వైరస్ పూర్తి స్థాయిలో అదుపులో ఉందని ప్రకటిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం వాస్తవాలను దాచేస్తున్నది’ అని అన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్‌ను ఏవిధంగా ఎదుర్కోవాలో ప్రజలకు సింగపూర్ ప్రధాని లీ హీసెన్ నూంగ్ పదే పదే చెబుతున్నారని రాహుల్ గుర్తు చేశారు. ఆ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీగానీ, ఇతర మంత్రులు గానీ ఎందుకు స్పందించడం లేదని రాహుల్ ప్రశ్నించారు. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఏవిధమైన చర్యలూ ప్రభుత్వం చేపట్టడం లేదని రాహుల్ ఆరోపించారు. ఇకనైనా కరోనా వైరస్‌కు సంబంధించిన వాస్తవాలను బహిరంగపరచి, నివారణ చర్యలు ముమ్మరం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

*చిత్రం... కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ