జాతీయ వార్తలు

మహిళలపై మోదీ ప్రశంసల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: దేశంలోని యావత్ మహిళాలోకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. అన్ని రంగాల్లో మహిళలు అగ్రగామిగా నిలుస్తూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారని గురువారం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చే మహిళలే తనకు స్ఫూర్తి ప్రదాతలనీ.. భారత్‌ను మహిళా శక్తే నడిపిస్తోందని కొనియాడారు. ‘మహిళా పారిశ్రామికవేత్తలు స్ఫూర్తి ప్రదాతలు.. నారీశక్తి భారత్‌ను కాపాడుతోంది.. క్రీడలు, రాజకీయాల్లో వీరు రాణిస్తున్నారు.. రైతులుగా మారిన అతివలే దేశానికి మార్గదర్శకం అవుతున్నారు.. ఇలా ఎన్నో రంగాల్లో మహిళలు తమ సత్తాను చాటుతూ ముందుకు సాగుతున్నారు.. విజయవంతమైన మీ జీవనయానాన్ని షేర్ చేయండి’ అంటూ ట్వీట్‌లో మోదీ పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘స్ఫూర్తిగా నిలిచే మహిళల’కు నా సోషల్ మీడియా ఖాతాలను అప్పజెప్పుతున్నా.. లక్షలాది మందికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలవండి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.