జాతీయ వార్తలు

ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో 53కు చేరిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న మత ఘర్షణల్లో మృతుల సంఖ్య 53కు చేరింది. గత ఆదివారం సీఏఏకు వ్యతిరేకంగా కొంతమంది చేపట్టిన ఆందోళన మత ఘర్షణలుగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. అల్లరి మూకలు యథేచ్ఛగా లూటీలకు పాల్పడ్డారు. గృహాలను, వాహనాలను తగులబెట్టారు. విచక్షణారహితంగా దాడులు చేయడంతో కొంతమంది మృతి చెందారు. మరికొంతమందిని కాల్చి చంపిన సంఘటన కూడా చోటుచేసుకుంది. ఈ అల్లర్లలో 42 మంది అప్పుడు మృతిచెందగా, తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో 11 మంది చనిపోయారు. మొత్తమీద మృతుల సంఖ్య 53కు చేరినట్టు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. మొత్తం 654 కేసులు నమోదు చేశామని, 1,820 మందిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రేక్షక పాత్ర వహించడం వల్లనే ఈ మారణకాండ చోటుచేసుకుందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పరిస్థితిని అదుపులో చేయడంలో కేంద్రం విఫలమైందని విపక్షాలు ఆరోపిస్తుంటే, ఢిల్లీ సర్కారే బాధ్యత వహించాలని కేంద్రం ఎదురు దాడికి దిగింది.
ఆ మృతదేహాల ఫొటోలు ఉంచండి
ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తుల ఫొటోలను ప్రచార, సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని పోలీసులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, ఐఎస్ మెహతాతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. మిస్సింగ్ కేసులను గుర్తించి, వివరాలు తీసుకుని వాటితో ఈ మృతదేహాలను సరిపోల్చాలని కూడా సూచించింది.