జాతీయ వార్తలు

వారి వ్యాఖ్యలు అభ్యంతరకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, యునైటెడ్ కింగ్‌డమ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి నిగెల్ ఆడమ్స్ ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత సున్నితమైన సమయంలో ఇలాంటి ప్రకటన చేయడం సమంజం కాదని హితవు పలికింది.
ఎర్డోగాన్ ఇటీవల ఓ ప్రకటనలో ఢిల్లీ అల్లర్లను ప్రముఖంగా ప్రస్తావించారు. ఒక వర్గానికి చెందిన ప్రజలను అణచివేస్తున్నారంటూ ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అమాయక ప్రజలపై భద్రతా సిబ్బంది దాడులు చేసి, పలువురి మృతికి కారణమయ్యారని విమర్శించారు. మిగెల్ ఆడమ్స్ కూడా దాదాపు ఇలాంటి ప్రకటనలే చేశారు. 42 మంది మృతికి భారత ప్రభుత్వమే కారణమంటూ ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని ఆయన విమర్శించారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని ఆయన అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఖండించారు. దేశంలోని ముస్లింలకు సీఏఏ వల్ల ఎలాంటి సమస్యా లేదని ఆయన స్పష్టం చేశారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కారకులైన వారిని అరెస్టు చేయడం జరిగిందే తప్ప, ఎవరినీ ప్రత్యేకంగా వేధించలేదని అన్నారు. అల్లర్లకు బాధ్యులైనవారు ఎవరైనాసరే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.