జాతీయ వార్తలు

సుప్రీం కోర్టులో హోలీ వెకేషన్ బెంచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: హోలీ సందర్భంగా వారం రోజుల పాటు అత్యవసర కేసులు విచారించేందుకు సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్‌ను ఏర్పాటు చేయనుంది. సుప్రీం కోర్టుకు ఈనెల 9 నుంచి 14 వరకూ హోలీ సెలవు లు. ఆ వారం రోజులూ అత్యవసర కేసులు విచారించేందుకు వెకేషన్ బెంచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే గురువారం వెల్లడించారు. ఓ కేసుకు అత్యవసర విచారణ జరపాలని, తేదీ ఖరారు చేయాలని ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించగా బాబ్డే ఈ విషయం తెలిపారు. వేసవి సెలవులు రెండు నెలలూ అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే.