జాతీయ వార్తలు

పోలీస్ శాఖతోనే ప్రజాస్వామ్య మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: పోలీస్ శాఖతోనే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమవుతుందని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువ పోలీస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. చట్టాలు సక్రమంగా అమలైతేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందని లేకపోతే అసలు ఆ పదానికి అర్థమే ఉండదని అన్నారు. చట్టాలను ప్రజాహితంగా రూపొందించడం ఎంత ముఖ్యమో వాటి అమలు కూడా అంతే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలకు, వాటి అమలుకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. ‘ఒకవేళ మీరు విఫలమైతే ప్రజాస్వామ్యమే విఫలమవుతుంది’ అని పోలీసులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
చట్టాలను పకడ్బందీగా అమలుపరిచే వ్యవస్థ లేకపోతే అసలు చట్టాలను రూపొందించే అవసరమే ఉండదని ఆయన అన్నారు. పోలీస్ వ్యవస్థతో తనకు సుమారు 50 సంవత్సరాల అనుబంధం ఉందని, కాబట్టి బాధ్యతలు ఏ స్థాయిలో ఉంటాయో తనకు తెలుసునని అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో పోలీసులు మరింత క్రియాశీలక పాత్రను పోషిస్తారని ఆయన చెప్పారు. ప్రజల్లో చట్టం పట్ల గౌరవాన్ని పెంచడంతోపాటు వారికి సంపూర్ణ భరోసా ఇవ్వడంలో పోలీసుల పాత్ర ప్రముఖంగా ఉంటుందని ఆయన అన్నారు.