జాతీయ వార్తలు

ఢిల్లీలో మూతపడ్డ స్కూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: కరోనా వైరస్ వ్యాపిస్తున్నదన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు ఈనెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. పిల్లలకు ఈ వ్యాధి తొందరగా సోకుతుందని, అందుకు ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. భారత్‌లో ఇప్పటివరకు 30 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో 16 మంది ఇటలీ టూరిస్టులు. ఈ 16 మందిలో 14 మంది ఐసోలేటెడ్ ప్రాంతంలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ బృందానికి చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం జైపూర్‌లో ఉన్నాడు. అతనికి, అతని భార్యకు కూడా కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్షల్లో స్పష్టమైంది. దీంతో వారిని కూడా ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈసారి హోలీ వేడుకల్లో పాలుపంచుకోవడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ వైరస్ ప్రభావంతో విద్యాసంస్థలు, కార్యాలయాలు బోసిపోతున్నాయి. దీంతో హోలీ సంబరాలు ఈసారి అంతగా కనిపించకపోవచ్చు.