S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/05/2020 - 02:58

న్యూఢిల్లీ: కరోనా వైరస్ భయం దేశ ప్రజలను వణికిస్తోంది. ఫలితంగా ఎయిర్ మాస్క్‌లకు, శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దేశ రాజధానిలోని చాలావరకు మందుల దుకాణాల్లో మాస్క్‌లు, శానిటైజర్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. కొన్ని దుకాణాల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో వీటి కొరత రోజురోజుకూ పెరుగుతోంది. ఎయిర్ మాస్క్‌ల ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు.

03/05/2020 - 02:57

నొయిడా: ఈ ఏడాది జనవరి 15 తర్వాత వివిధ దేశాల నుంచి భారత్‌కు తిరిగివచ్చిన వారిని ముందు జాగ్రత్త చర్యగా వైద్య పరీక్షలకు అధికారులు తరలించారు. 373 మందికి పరీక్షలు నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ వైద్య పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు పరీక్షించిన వారిలో 55 మందికి ఈ వైరస్ ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

03/05/2020 - 02:56

న్యూఢిల్లీ, మార్చి 4: కరోనా వైరస్‌పై కేంద్రం అప్రమత్తమైంది. తొలుత కేరళలో ఓ కేసు నమోదైన తర్వాత క్రమంగా వివిధ నగరాలకు ఈ వైరస్ విస్తరించడం ఆందోళనకు కారణం అవుతోంది. హైదరాబాద్‌లో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు ప్రకటించారు. వీరిలో ఒకరిని గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

03/05/2020 - 03:16

న్యూఢిల్లీ, మార్చి 4: ఢిల్లీలో ఇటీవల చెలరేగిన అల్లర్లపై వెంటనే చర్చ జరపాలంటూ ప్రతిపక్షం పట్టుపట్టి గొడవ చేయడంతో బుధవారం పార్లమెంటు ఉభయ సభలు వాయిదాలు, గొడవ, గందరగోళం మధ్య గురువారానికి వాయిదా పడ్డాయి. లోకసభ మూడు వాయిదాలతో దాదాపు తొమ్మిది నిమిషాలు మాత్రమే కొనసాగింది. రాజ్యసభ సమావేశం ప్రారంభమైన కొన్ని నిమిషాలకే రేపటికి వాయిదా పడింది.

03/05/2020 - 00:50

న్యూఢిల్లీ, మార్చి 4: చైనాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మూలంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంవత్సరం హోలీ పండుగకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇతరులు ఏర్పాటు చేసే హోలీ మిలన్ కార్యక్రమాలకు కూడా హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. హోలీ పండుగను జరుపుకోకూడదని నిర్ణయించుకోవటంతో పాటు హోలీ జరుపుకునేందుకు

03/04/2020 - 03:35

దేశంలో తాజాగా ప్రమాదకర కరోనా వైరస్ కేసులు బయటపడిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సహా అంతటా జనం అప్రమత్తం అయ్యారు. పౌరుల నుంచి వైద్యుల వరకు ముఖానికి రక్షిత మాస్క్‌లు ధరిస్తేగానీ వీధుల్లోకి రావడం లేదు. ఆగ్రాలోని తాజ్ సందర్శనకు వచ్చిన టూరిస్టులు సైతం రక్షిత మాస్క్‌లతోనే ఈ అందాల సౌధాన్ని వీక్షించారు. ఈ దృశ్యాలు ప్రాణాంతక వైరస్ పట్ల ప్రజల అప్రమత్తతను
చాటిచెబుతున్నాయి.

03/04/2020 - 03:33

న్యూఢిల్లీ/లక్నో, మార్చి 3: కరోనా వైరస్ కారణంగా ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలపై విస్తృత స్థాయిలో ఆయన చర్చలు చేపట్టారు.

03/04/2020 - 03:31

న్యూఢిల్లీ, మార్చి 3: ఢిల్లీలో అల్లర్లకు పాల్పడిన వారిని ఏ కోశాన వదిలి పెట్టకుండా కఠినంగా శిక్షించాలని ‘ఆప్’ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని మోదీని కలుసుకోవడం ఇదే ప్రథమం.

03/04/2020 - 03:25

న్యూఢిల్లీ, మార్చి 3: ‘నాకు నా 12వ తరగతి పరీక్షలు రాసిన సంవత్సరం ఎల్లప్పుడూ గుర్తుంటుంది. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితి అలాంటిది.’ ఢిల్లీలోని జఫ్రాబాద్ ప్రాంతంలో గల జాకీర్ హుస్సేన్ మెమోరియల్ స్కూల్ విద్యార్థి ఒకరు మంగళవారం నాడు అన్న మాటలివి.

03/04/2020 - 03:25

న్యూఢిల్లీ, మార్చి 3: కరోనా వైరస్ కారణంగా ఓ పక్క భారతదేశం ఎమర్జెన్సీ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ‘ఓ విదూషకుడి’ పాత్ర పోషిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంటే మీరు సామాజిక మీడియా ఖాతాల మీమాంసలో కాలక్షేపం చేస్తున్నారంటూ రాహుల్ మంగళవారం ట్విటర్‌లో ప్రధానిపై విరుచుకుపడ్డారు.

Pages