జాతీయ వార్తలు

‘విదూషకుడి పాత్ర’ మాని కరోనాపై దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: కరోనా వైరస్ కారణంగా ఓ పక్క భారతదేశం ఎమర్జెన్సీ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ‘ఓ విదూషకుడి’ పాత్ర పోషిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంటే మీరు సామాజిక మీడియా ఖాతాల మీమాంసలో కాలక్షేపం చేస్తున్నారంటూ రాహుల్ మంగళవారం ట్విటర్‌లో ప్రధానిపై విరుచుకుపడ్డారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో రాహుల్ పైవిధంగా స్పందించారు. ‘డియర్ మోదీజీ.. యావత్ దేశం అంతటా కరోనా వైరస్ నేపథ్యంలో ఎమర్జెన్సీ పరిస్థితి కనిపిస్తుంటే.. మీరు సామాజిక మాధ్యమాల ఖాతాల నుంచి వైదొలగాలని అనుకొన్నాను.. అని మాట్లాడుతూ భారత్ విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. ‘సింగపూర్ ప్రధాని లీజీన్ లూంగ్‌ను చూసి కాస్త నేర్చుకోండి.. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిపై ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో ఆ దేశ ప్రధాని సింగపూర్ ప్రజలను చైతన్యం చేస్తున్నారో ఈ వీడియోను చూసి నేర్చుకోండి’ అంటూ ఓ వీడియోను సైతం ట్విటర్‌లో రాహుల్ పోస్టు చేశారు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలకు ఇకపై దూరంగా ఉండాలని భావిస్తున్నాను అంటూ మోదీ పేర్కొనడం.. పైగా తన సామాజిక మాధ్యమాల ఖాతాలను యావత్ మహిళా లోకానికి అప్పజెబుతున్నాననీ.. మహిళా దినోత్సవం రోజు నుంచి మీరు సాధించే విజయాలను నాతో షేర్ చేసుకోండి అంటూ మంగళవారం పేర్కొనడాన్ని రాహుల్ ప్రస్తావించారు. యావత్ ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తూ ఇప్పటికే భారత్‌లో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం తెలిసిందే. దేశ ప్రజలంతా ఈ భయంతో వణికిపోతున్నారు.. ఈ ప్రభావం దేశంపైన, భారత్ ఆర్థిక వ్యవస్థపైన పడే ప్రమాదం పొంచి ఉంది అంటూ రాహుల్ పేర్కొనడం తెలిసిందే. ‘మన ప్రజలు - ఆర్థిక వ్యవస్థ’ పేరుతో గత నెల 12వ తేదీన చేసిన ట్వీట్‌ను మరోసారి ప్రధాని దృష్టికి రాహుల్ తీసుకొచ్చారు. ‘ప్రభుత్వం కరోనా వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదన్నది నా అభిప్రాయం.. ప్రమాదకరంగా మారకుండా త్వరితగతిన అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని రాహుల్ పేర్కొన్నారు.