జాతీయ వార్తలు

మెరుగైన చరిత్ర లిఖించబడుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: ‘నాకు నా 12వ తరగతి పరీక్షలు రాసిన సంవత్సరం ఎల్లప్పుడూ గుర్తుంటుంది. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితి అలాంటిది.’ ఢిల్లీలోని జఫ్రాబాద్ ప్రాంతంలో గల జాకీర్ హుస్సేన్ మెమోరియల్ స్కూల్ విద్యార్థి ఒకరు మంగళవారం నాడు అన్న మాటలివి. ఈశాన్య ఢిల్లీలోని ఇటీవల మత ఘర్షణలు జరిగిన ప్రాంతాలలో మంగళవారం పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఉండగా, తమ తల్లిదండ్రులు స్కూల్ గేట్ల వద్ద నిలబడి ఎంతో ఆందోళన, ఆతృతతో వేచిచూస్తుండగా, 12వ తరగతి విద్యార్థులు తమ చరిత్ర పరీక్ష రాశారు. దేశ రాజధాని చరిత్రలో మత ఘర్షణలను మించిన ‘మెరుగయిన పరిస్థితులు’ నెలకొన్నాయని లిఖిస్తామన్న విశ్వాసం తమకు ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకున్న వారిలో 98 శాతానికి పైగా మంది మంగళవారం నాటి పరీక్షకు హాజరయ్యారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరి ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తెలిపింది. గైర్హాజరయిన వారిలో ప్రైవేటు అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు. ‘్ఢల్లీలో ఇప్పుడు సృష్టించబడి ఉన్న చరిత్ర భయంకరంగా ఉంది. దీన్ని చూస్తుంటే పరీక్షలకు సన్నద్ధం కావడానికి నేను నేర్చుకున్న చరిత్ర అసంగతంగా ఉంది. హింస, ఘర్షణలతో కూడిన ఈ చరిత్ర కాకుండా, దీనికన్నా మెరుగయిన చరిత్ర ఢిల్లీలో, దేశంలో సృష్టించబడుతుందనే విశ్వాసం నాకు ఉంది’ అని ఒక విద్యార్థి అన్నారు. అయితే, తన పేరు వెల్లడించడానికి ఆ విద్యార్థి ఇష్టపడలేదు. ‘చుట్టూ పోలీసులు ఉన్నారు. కాని, ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. నేనే చాలా భయపడుతూ ఉన్నానంటే, పరీక్ష రాస్తున్న విద్యార్థుల మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుందని నేను ఆశ్చర్యపోతున్నాను’ అని ముస్త్ఫాబాద్‌లోని ప్రభుత్వ బాలుర సీనియర్ సెకండరి స్కూల్‌లో పరీక్ష రాస్తున్న తన కుమారుడి కోసం ఆ పాఠశాల బయట వేచిచూస్తున్న రూపాదేవి అనే మహిళ పేర్కొన్నారు.