జాతీయ వార్తలు

ఎవరినీ వదిలి పెట్టవద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: ఢిల్లీలో అల్లర్లకు పాల్పడిన వారిని ఏ కోశాన వదిలి పెట్టకుండా కఠినంగా శిక్షించాలని ‘ఆప్’ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని మోదీని కలుసుకోవడం ఇదే ప్రథమం. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనందున ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేరుగా పార్లమెంటు ఆవరణలో ఉన్న ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరుకుని ప్రధాని మోదీతో అరగంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురూ ఈశాన్య ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. శాంతి-్భద్రతలను కాపాడడంతో ఢిల్లీ పోలీసులు సమయ స్పూర్తితో వ్యవహారిస్తున్నారని కేజ్రీవాల్ ప్రధానితో అన్నారు. ఆదివారం రాత్రి లేనిపోని వదంతులు వ్యాపించిన సమయంలో కూడా ఢిల్లీ పోలీసులు వాటిని తిప్పికొట్టారని ఆయన తెలిపారు. గత సోమ, మంగళవారం ఈశాన్య ఢిల్లీలో నెలకొన్న వదంతులు, ఉద్రిక్త పరిస్థితులను, అల్లర్లను అదుపు చేశారని, అనేక మంది ప్రాణాలను కాపాడారని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అల్లర్ల కారణంగా 42 మంది మరణించారని, సుమారు 200 మంది గాయపడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని, అల్లర్లకు బాధ్యులైన వారిని పార్టీలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీని కోరినట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు.
*చిత్రం... ప్రధాని మోదీతో మంగళవారం సమావేశమైన అనంతరం పార్లమెంటు హౌస్ నుంచి బయటకు వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్