జాతీయ వార్తలు

కేంద్రం అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: కరోనా వైరస్‌పై కేంద్రం అప్రమత్తమైంది. తొలుత కేరళలో ఓ కేసు నమోదైన తర్వాత క్రమంగా వివిధ నగరాలకు ఈ వైరస్ విస్తరించడం ఆందోళనకు కారణం అవుతోంది. హైదరాబాద్‌లో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు ప్రకటించారు. వీరిలో ఒకరిని గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇలావుంటే, దేశవ్యాప్తంగా ఈ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పలువురు ఉన్నతాధికారులతో బుధవారం సమావేశమై చర్చించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్రం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని ప్రకటించారు. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని తీర్మానించారు. అదేవిధంగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినవారు అంతకుముందు వారం, పది రోజుల వ్యవధిలో ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ తిరిగారు అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లోని వారికి కూడా ముందస్తు జాగ్రత్త చర్యగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 28 మందికి ఈ వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని హర్షవర్దన్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఢిల్లీలో ఒకరు, ఆగ్రాలో ఆరుగురు, తెలంగాణలో ఇద్దరు, కేరళలో ముగ్గురికి ఈ వైరస్ సోకినట్టు పేర్కొన్నారు. ఇటలీ టూరిస్టులు 16 మందికి కూడా వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చిందని ఆయన వివరించారు. ఢిల్లీలో నిర్థారణ అయిన కేసు తాలూకా వ్యక్తి కారణంగానే ఆగ్రాలో ఆరుగురికి ఈ వైరస్ సోకినట్టు ఆయన వివరించారు. ఒకరికి ఈ వైరస్ సోకినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్టు ఆయన చెప్పారు. మరో కేసుపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదని వివరించారు. కాగా, ఒడిశా ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసిందని, అవి మిగతా ప్రాంతాల వారికి కూడా ఆచరణీయమని హర్షవర్దన్ అన్నారు. కరచాలనం, ఆలింగనం కూడదని ఒడిశా ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసిందని ఆయన చెప్పారు. పలకరింపులకు షేక్ హ్యాండ్ ఇచ్చే బదులు నమస్కారం పెట్టడం ఉత్తమమైన మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.

*చిత్రం...కరోనా వైరస్‌పై బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్