జాతీయ వార్తలు

హోలీకి దూరంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: చైనాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మూలంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంవత్సరం హోలీ పండుగకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇతరులు ఏర్పాటు చేసే హోలీ మిలన్ కార్యక్రమాలకు కూడా హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. హోలీ పండుగను జరుపుకోకూడదని నిర్ణయించుకోవటంతో పాటు హోలీ జరుపుకునేందుకు
గంపులు, గుంపులుగా చేరకూడదని ప్రజలకు హితవు చెప్పారు. నరేంద్ర మోదీ ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వ్యాపించకుండా చూసేందుకు పెద్ద సంఖ్యలో సమావేశం కావడం గుంపుగా ఉండడం వంటివి చేయకూడదని ప్రపంచంలోని పలువురు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను ఈ సంవత్సరం హోలీకి దూరంగా ఉండడంతోపాటు హోలీ పండుగ సందర్భంగా జరిగే సమావేశాలకు హాజరుకావద్దని నిర్ణయించుకున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. దేశంలో కేవలం ఆరు కరోనా వైరస్ కేసులు ముందుకు వచ్చినందున ప్రజలు పెద్దగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పిలుపు ఇచ్చిన నరేంద్ర మోదీ బుధవారం హోలీ పండుగ జరుపుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఆమిత్ షా కూడా..
ఇదిలాఉండగా హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కూడా హోలీ పండుగకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. కరోనా వైరస్ దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాపించడంతో ప్రముఖులతో పాటు ప్రజలందరూ భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో హోలీ పండుగ రావడంతో కరోనా వైరస్ రావడంతో ప్రజలు కలవరపడుతున్నారు.

*చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ