జాతీయ వార్తలు

భయం వద్దు.. జాగ్రత్తలు వీడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/లక్నో, మార్చి 3: కరోనా వైరస్ కారణంగా ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలపై విస్తృత స్థాయిలో ఆయన చర్చలు చేపట్టారు.
అనవసర ఆందోళనలు చెందకుండా ప్రజలు వౌలికపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మరోపక్క పౌరవిమానయాన శాఖ కూడా అన్ని విమానాశ్రయాల్లోనూ సమీక్షలు నిర్వహించింది. విదేశీ పర్యాటకులకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలోని అనేక చోట్ల కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. నివారణ, నిరోధక చర్యలపై దృష్టి సారించాయి. వైరస్ లక్షణాలు ఉన్న వారిని ఏకాంత శిబిరాల్లో ఉంచి సత్వర చికిత్సను చేపట్టాయి. ఇతర దేశాలకు వీసా నిలిపి వేత నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు దేశాలకు విస్తరించింది. ఢిల్లీలో ఓ వ్యక్తికి వైరస్ ఉన్న లక్షణాలు ఉన్నట్లు తేలడంతో, ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తి కుటుంబీకులను, మరి కొందరిని కూడా క్వారైంటెన్ శిబిరానికి తరలించారు. ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు కూడా మాములు, ఈ-వీసాల నిలిపి వేతను ప్రభుత్వం విస్తరించింది. దాదాపు 60 దేశాలకు విస్తరించిన ఈ కరోనా వైరస్ ఇప్పటి వరకు 3 వేల మందిని బలిగొంది. మరో 90 వేల మందికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా వెలుగు చూసిన వారితో కలిపి ఇప్పటి వరకు 6 కోవిడ్-19 కేసులు వెలుగు చూశాయి. నోయిడాలో రెండు స్కూళ్ళను అధికారులు మూసి వేశారు. వైరస్ లక్షణాలు ఉన్న తక్షణమే గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టుల విషయంలో నిరంతర అప్రమత్తత పాటిస్తున్నారు. ఆగ్రాకు చెందిన ఆరుగురికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించడంతో సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. వీరి శాంపిల్స్‌పై పరిశీలన జరుగుతున్నది.

*చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ