S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/01/2020 - 05:49

భువనేశ్వర్, ఫిబ్రవరి 29: ప్రజలకు ఆరోగ్యపరమైన సేవలు అందించడంతోపాటు వైద్య శాస్త్రాల పరిశోధనలో కూడా ప్రైవేటురంగం క్రియాశీలక భూమిక పోషించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. భువనేశ్వర్‌లో శనివారం ఓ ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన అమిత్ షా ‘వైద్య కళాశాలలను తెరిచినంత మాత్రాన హెల్త్‌కేర్ రంగం పూర్తిగా అభివృద్ధి చెందినట్టు కాదు.

03/01/2020 - 05:42

చిత్రకూట్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 29: దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ దశ తిరగబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు ఇక్కడ ప్రకటించారు. 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన మోదీ ‘15వేల కోట్లతో ఈ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తున్నాం. దీనివల్ల ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది’ అని తెలిపారు.

03/01/2020 - 05:38

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: పౌరసత్వ వ్యతిరేక ఉద్యమాల పేరుతో దాదాపు నాలుగు రోజుల పాటు మత హింసతో అట్టుడికిన దేశ రాజధాని ఢిల్లీలో శనివారం శాంతి యాత్రను నిర్వహించారు. త్రివర్ణ పతాకాలు చేతబట్టి వేలాదిమంది జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అన్న నినాదాలతో ఈ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ శాంతి ఫోరం అనే ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఇందులో అల్లర్ల బాధిత కుటుంబాలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.

03/01/2020 - 05:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీ ప్రాంతం రెండో రోజైన శనివారం మరింతగా కోలుకుంది. ఓపక్క శాంతి యాత్రలు, పోలీసుల కవాతు నేపథ్యంలో భయాన్ని వీడి జనం బయటకు వస్తున్నారు. గత ఐదు రోజులుగా బయటకి రావాలంటేనే తల్లడిల్లిన ప్రజలు శనివారం ధైర్యంగా వీధుల్లోకి వచ్చి నిత్యావసరాలను కొనుగోలు చేశారు. మందుల షాపులు, పచారీ దుకాణాలకు జనం రద్దీ మొదలైంది.

03/01/2020 - 05:29

జైపూర్, ఫిబ్రవరి 29: చట్టసభలో ఫిరాయింపుచట్టం పక్కాగా అమలు చేయడానికి వీలుగా చట్టంలో మార్పులు రావల్సిన అవసరం ఉందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీలో శనివారం రాజ్యాంగంలోని 10 షెడ్యూల్‌పై జరిగిన వర్క్‌షాప్‌లో ప్రసంగించారు. కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) సహకారంతో పదో షెడ్యూల్‌లో స్పీకర్ పాత్రపై వర్క్‌షాప్ ఏర్పాటైంది.

03/01/2020 - 05:18

కోల్‌కతా, ఫిబ్రవరి 29: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రకటనల ప్రచారానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు వచ్చిన ఆరోపణలపై సమాచారం ఇవ్వవలసిందిగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ కోరారు. అలాగే, ఈ ప్రకటనల కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన అధికారుల వివరాలు కూడా తెలియజేయాల్సిందిగా ఆయన కోరారు. అధికార వర్గాలు శనివారం నాడిక్కడ ఈ విషయం తెలిపాయి.

03/01/2020 - 05:18

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: తమ అసమర్థ విధానాలతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద శర్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు విధానాలు, ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో దుయ్యబట్టారు.

03/01/2020 - 05:17

సీతాపూర్ (యూపీ), ఫిబ్రవరి 29: ‘జైలులో నా పట్ల ఉగ్రవాది తరహాలో అమానవీయంగా ప్రవర్తించారు’ అని సమాజ్‌వాది పార్టీ ఎంపీ ఆజం ఖాన్ ఆరోపించారు. శనివారం ఉదయం ఆజం ఖాన్‌ను సీతాపూర్ జైలు నుంచి రాంపూర్ కోర్టుకు పోలీసు వ్యానులో తరలించారు. ఖాన్ భార్య ఎమ్మెల్యే తంజన్ ఫాతిమా, ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడిన అబ్దుల్లా ఆజంను మరో కేసులో రాంపూర్ కోర్టుకు తీసుకెళ్ళారు.

03/01/2020 - 05:10

అలహాబాద్, ఫిబ్రవరి 29: దేశ ప్రజలందరికీ న్యాయం చేయడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలందరూ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందడం, అందరికీ న్యాయం జరిగేలా చూడడమే ప్రభుత్వ బాధ్యత అని, అందరితో కలిసి ప్రగతిపథంలో నడవడం, ప్రతిఒక్కరి విశ్వాసాన్ని చూరగొనాలన్న తమ విధాన ముఖ్య ఉద్దేశం ఇదేనని మోదీ తెలిపారు.

03/01/2020 - 05:07

జమ్మూ, ఫిబ్రవరి 29: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెన్షనర్లను దేశం ఆస్తిగా పరిగణిస్తున్నదే తప్ప నష్టంగా భావించడం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. శనివారం నాడిక్కడ ఆయన ‘పెన్షన్ ఆదాలత్’ను ప్రారంభించారు.

Pages