జాతీయ వార్తలు

బుందేల్‌ఖండ్ దశ తిరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రకూట్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 29: దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ దశ తిరగబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు ఇక్కడ ప్రకటించారు. 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన మోదీ ‘15వేల కోట్లతో ఈ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తున్నాం. దీనివల్ల ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది’ అని తెలిపారు. ఆగ్రా, లక్నో ద్వారా దేశ రాజధాని ఢిల్లీకి కూడా బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే చేరువవుతుందని మోదీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాల్లోనే ఎంతో మార్పు వస్తుందని తెలిపారు. 15వేల కోట్ల రూపాయలతో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టు వల్ల వేలాదిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పెద్ద పట్టణాల్లో లభించే సౌకర్యాలు కూడా ఇక్కడి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటివరకు చేపట్టిన పలు ప్రాజెక్టుల వల్ల ఉత్తరప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల మధ్య సంధానత పెరిగిందని, ఉపాధి అవకాశాలు ఇనుమడించాయని వెల్లడించారు. గతంలో బుందేల్‌ఖండ్ ప్రాంత రైతులకు అప్పటి ప్రభుత్వాలు ఎంతగానో సహాయ కార్యక్రమాలు ప్రకటించినా వీరికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని అన్నారు. అయితే, తమ ప్రభుత్వం ప్రతి పైసా నిర్దేశిత లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్ వేగంతో పరుగెడుతోందంటూ కితాబిచ్చారు. ఇప్పటివరకు ఈరకమైన ఎక్స్‌ప్రెస్ వేలు ఢిల్లీ, ముంబయి వంటి పెద్ద పట్టణాల్లోనే ఉండేవని, ఇప్పుడు యూపీలోని అనేక పట్టణాలకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని అన్నారు.