జాతీయ వార్తలు

ఢిల్లీలో శాంతి..శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: పౌరసత్వ వ్యతిరేక ఉద్యమాల పేరుతో దాదాపు నాలుగు రోజుల పాటు మత హింసతో అట్టుడికిన దేశ రాజధాని ఢిల్లీలో శనివారం శాంతి యాత్రను నిర్వహించారు. త్రివర్ణ పతాకాలు చేతబట్టి వేలాదిమంది జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అన్న నినాదాలతో ఈ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ శాంతి ఫోరం అనే ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఇందులో అల్లర్ల బాధిత కుటుంబాలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విద్రోహులను కాల్చి చంపాలి అన్న నినాదాలు కూడా వెల్లువెత్తాయి. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు స్ట్రీట్ వరకు ఈ ర్యాలీని నిర్వహించి ప్రజల్లో భయాన్ని తొలగించి ధీమాను కలిగించే ప్రయత్నం చేశారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అల్లర్ల సమయంలో తాము ఎదుర్కొన్న భయానక పరిస్థితులను బాధిత కుటుంబీకుల సభ్యులు ఈ సందర్భంగా వివరించారు. అలాగే దాడిలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్, ఐబీ అధికారి అంకిత్ శర్మలకు ఘన నివాళులు అర్పించారు. అల్లర్లలో మరణించిన 42 మంది కుటుంబాలు వీధిన పడ్డాయని, అభం శుభం తెలియని ఈ వ్యక్తులు మత కలహాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ తాము ఎదుర్కొన్న పరిస్థితి ఏ కారణంగా తమవారిని తాము కోల్పోవాల్సి వచ్చిందో వెల్లడించారు. మృతుల కుటుంబాల్లో పెద్దలు, చిన్నపిల్లలు ఇప్పుడు ఏకాకులయ్యారని, వారిని ఆదుకునేదెవరన్న ఆందోళన ప్రతిఒక్కరిలోనూ కనిపించింది. ఓ పథకం ప్రకారమే ఈశాన్య ఢిల్లీలో మత హింసలు సృష్టించారని, హిందువులే లక్ష్యంగా దాడులు జరిగాయని ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు అన్నారు. పోలీసుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడంతోపాటు వారిపై అపవాదులు వేసే ప్రయత్నం కూడా జరుగుతోందని లెఫ్ట్‌నెంట్ జనరల్ కోహ్లీ అన్నారు. పౌరు లు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ అల్లర్లకు సంబంధించి ఎవరు ఎంతగా తప్పుడు ప్రచా రం చేస్తున్నా వాస్తవాలు ప్రజలకు తెలుసునని వక్త లు అన్నారు. తానే తప్పూ చేయలేదని, మత కలహాలను రెచ్చగొట్టేలా మాట్లాడలేదని బీజేపీ నేత మిశ్రా స్పష్టం చేశారు. ఢిల్లీ అల్లర్లకు పాల్పడ్డ వ్యక్తులు అన్నివిధాలుగా ఆరితేరిన వారని, అనేక మారణాయుధాల వినియోగంలోనూ సుశిక్షితులని లెఫ్ట్‌నెంట్ జనరల్ విజయ్ చతుర్వేది అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులను సృష్టించారని ఆయన తెలిపారు.

*చిత్రం... ఈశాన్య ఢిల్లీలో మత హింసకు వ్యతిరేకంగా శనివారం ప్లకార్డులతో జరిగిన శాంతి ప్రదర్శన