జాతీయ వార్తలు

ఆ నిధుల వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 29: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రకటనల ప్రచారానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు వచ్చిన ఆరోపణలపై సమాచారం ఇవ్వవలసిందిగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ కోరారు. అలాగే, ఈ ప్రకటనల కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన అధికారుల వివరాలు కూడా తెలియజేయాల్సిందిగా ఆయన కోరారు. అధికార వర్గాలు శనివారం నాడిక్కడ ఈ విషయం తెలిపాయి. సీఏఏ వ్యతిరేక కార్యక్రమానికి వ్యయం చేసిన డబ్బు వివరాలను గవర్నర్‌కు తెలియజేయాల్సిందిగా ఆదేశిస్తూ గవర్నర్ కార్యాలయం ఈ మేరకు ప్రభుత్వ సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరికి ఒక లేఖ రాసిందని వారు వెల్లడించారు. ‘నో సీఏఏ, నో ఎన్‌ఆర్‌సీ, నో ఎన్‌పీఆర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రింట్, విజువల్ మీడియాలో ప్రకటనల కోసం ‘కోట్లాది రూపాయలు’ వ్యయం చేయడం పట్ల గవర్నర్ ఫిబ్రవరి నాలుగో తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆక్షేపణ తెలియజేశారు. ఈ వ్యాపార ప్రకటనలు జారీ చేయడంలో ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ సహా సీనియర్ పాలనా, పోలీసు విభాగాల అధికారుల పాత్ర ఉండటం పట్ల ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
ఒక చెల్లుబాటు అయ్యే చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు ప్రభుత్వ వ్యయంతో ప్రకటనలు జారీ చేస్తూ మద్దతు ఇవ్వరాదని ధన్‌కర్ గతంలో పదేపదే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తరువాత, అలాంటి అడ్వర్టయిజ్‌మెంట్లు అన్నింటిని నిలిపివేయవలసిందిగా కలకత్తా హైకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేసిన సందర్భాలలో ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి.