జాతీయ వార్తలు

ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: తమ అసమర్థ విధానాలతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద శర్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు విధానాలు, ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో దుయ్యబట్టారు. గ్రామీణ నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ‘ఎంఎన్‌ఆర్‌ఇజీఏ’ ఉద్యోగ పథకానికి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పథకం కింద 150 రోజులు ఉపాధి కల్పించాలని, దినసరి వేతనంగా రూ.500 చెల్లించాలని ఆయన కోరారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని ఆయన కోరారు. ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు కల్పించకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుండడం వల్ల సమాజంలో అశాంతికి కారణమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసంఖ్యాకంగా నిరుద్యోగులు ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారో నిజాయితీగా వెల్లడించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గత ఏడేళ్ళలో మొదటి సారి జీడీపీ రేటు త్రైమాసికంలో 4.7 శాతానికి పడిపోయిందని ఆయన విమర్శించారు. సాధారణంగా మొదటి త్రైమాసికం సమయంలో పండుగలు ఉంటాయి కాబట్టి బాగా వృద్ధి ఉంటుంది కానీ ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలు డబ్బు ఖర్చు చేయలేకపోయారని అన్నారు. అందుకు కారణం ప్రజల వద్ద ఆశించిన మేర డబ్బు లేకపోవడమేనని ఆయన తెలిపారు. ద్రవ్యలోటు అనూహ్యంగా ఉందని ఆనంద శర్మ విమర్శించారు.