జాతీయ వార్తలు

పరిస్థితి మరింత మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీ ప్రాంతం రెండో రోజైన శనివారం మరింతగా కోలుకుంది. ఓపక్క శాంతి యాత్రలు, పోలీసుల కవాతు నేపథ్యంలో భయాన్ని వీడి జనం బయటకు వస్తున్నారు. గత ఐదు రోజులుగా బయటకి రావాలంటేనే తల్లడిల్లిన ప్రజలు శనివారం ధైర్యంగా వీధుల్లోకి వచ్చి నిత్యావసరాలను కొనుగోలు చేశారు. మందుల షాపులు, పచారీ దుకాణాలకు జనం రద్దీ మొదలైంది. పరిస్థితులు కొంత మెరుగైనప్పటికీ ఈశాన్య ఢిల్లీ నిఘా నీడనే కొనసాగుతోంది. పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళనలు మత హింసకు దారితీయడంతో 42 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స జరుగుతూనే ఉంది. అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న విధ్వంసకాండ వల్ల పగిలిన అద్దాలు, విరిగిన గోడలతో నిండిన రోడ్లను మున్సిపల్ సిబ్బం ది బుల్‌డోజర్ల సహాయంతో తొలగించి ఆయా మార్గాలను జన సంచారానికి అనుగుణంగా మారుస్తున్నారు. జఫ్రాబాద్, వౌజీపూర్, యము నా విహార్, చాంద్‌బాగ్, ముస్త్ఫాబాద్ వంటి మత కలహాల పీడిత ప్రాంతాల్లో జనసంచారం మొదలైంది. రోడ్లపై వాహనాల రద్దీ కూడా కనిపించింది. ప్రజలు శాంతియుతంగా, మతసామరస్యంతో వ్యవహరించాలని చెబుతున్న పోలీస్ దళాలు ఎలాంటి భయం లేకుండా తమ తమ వ్యాపారాలు చేసుకోవాలని ఆయా దుకాణాల యజమానులకు ధీమా కల్పిస్తున్నారు. జఫ్రాబాద్‌లో కవాతు నిర్వహించారు. అక్కడ నుంచి చిన్నచిన్న సందుల గుండా సాగిన పోలీస్ కవాతు కొంతమేర జనంలో భయం పోగొట్టింది. అయితే, ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ఇంకా స్కూళ్లు మూతబడే ఉన్నాయి. వచ్చే నెల 7వ తేదీ వరకు వీటిని తెరిచే అవకాశం కనిపించడం లేదు. కేవలం చిన్న చిన్న దుకాణాలు మాత్రమే పనిచేస్తున్నాయని, పెద్ద దుకాణాల యజమానులు వాటిని తెరవాలంటేనే భయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికి కూడా వారిని ఒప్పించి ధీమా కల్పించి దుకాణాలు తెరిచి మామూలుగా వ్యాపారాలు చేసుకోవాలని అధికారులు ప్రోత్సహిస్తున్నారు. అయితే, ఈ ఐదు రోజులుగా ఎలాంటి సరఫరాలు లేకపోవడం వల్ల నిత్యావసరాల ధరలు ఎక్కువగానే ఉన్నాయని, అయినప్పటికి కూడా అవి అందుబాటులోకి రావడం తమకు కొంతమేర ఊరట కలిగించిందని స్థానికులు చెబుతున్నారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు వివిధ రకాల పరీక్షలను కూడా వాయిదా వేశారు. రెచ్చగొట్టే సందేశాలను ఎవరు వ్యాపింపజేసినా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ఢిల్లీ సర్కారు ఓ వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారానే వదంతులు వ్యాపింపజేసే వారిపై ఫిర్యాదులు స్వీకరిస్తారు. కాగా, అల్లర్లలో గల్లంతైనవారి పరిస్థితి ఏమిటన్నది అంతుబట్టడం లేదు. వీరు చికిత్స పొందుతున్నారా? లేదా మరణించారా? అన్నది తెలియక సంబంధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ‘మంగళవారం నుంచి నా కుమారుడు కనిపించడం లేదు. అతని కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ను. అతడు బతికున్నాడా లేదా అన్నది అంతుబట్టడం లేదు. జీటీబీ ఆసుపత్రి మార్చురీలో అతడు ఉన్నాడని తెలిసినా నా యాతన తీరుతుం ది’ అని ఓ 45 సంవత్సరాల మదీనా అనే మహిళ వెల్లడించారు. 18 తన సోదరుడు అఫ్తాబ్ కోసం మహమ్మద్ ఖాదీ అనే మరో వ్యక్తి కూడా ఇటు పోలీస్ స్టేషన్లు, అటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు.
*చిత్రం... బాధితులకు ఆహారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలు