జాతీయ వార్తలు

పెన్షనర్లు భారం కాదు..సంపదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, ఫిబ్రవరి 29: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెన్షనర్లను దేశం ఆస్తిగా పరిగణిస్తున్నదే తప్ప నష్టంగా భావించడం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. శనివారం నాడిక్కడ ఆయన ‘పెన్షన్ ఆదాలత్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ పెన్షన్ విధానంపై అవగాహన కోసం పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. ‘మీకు ఈ విషయం తెలుసా’ శీర్షికతో పెన్షన్లకు సంబంధించి ముద్రించిన బుక్‌లెట్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసంగిస్తూ దేశంలో పదవీ విరమణ చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉందన్నారు. అయితే వారి శక్తులను సానుకూల పద్ధతిలో వినియోగించుకుంటామని ఆయన తెలిపారు. దీనిని తమ ప్రభుత్వం భారంగా పరిగణించడం లేదని దేశ ఆస్తిగా భావిస్తున్నదని ఆయన చెప్పారు. పదవీ విరమణ చేసిన వారి సేవలను, సూచనలను తప్పకుండా స్వీకరిస్తామని ఆయన తెలిపారు. పదవీ విరమణ చేసిన వారు ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని కోరుకుంటున్నానని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల, పైగా జమ్మూలో మొదటిసారి పెన్షన్ అదాలత్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. పెన్షనర్లు తమ సమస్యను చెప్పుకుని పరిష్కరించుకోవడానికి ఈ అదాలత్‌లో ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. పెన్షన్ అదాలత్‌ల వల్ల పెన్షనర్లకు ఎవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ముందు పెన్షనర్లు సమస్యలతో ఎన్నో విధాలుగా సతమతమయ్యారని ఆయన తెలిపారు. అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పెన్షన్ అదాలత్‌లతో అప్పటికప్పుడు సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు. పెన్షనర్లు ఎటువంటి సమస్యలతో బాధ పడరాదని ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే సంబంధిత అధికారులను ఆదేశించారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.