S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/26/2020 - 23:41

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: జమ్మూకాశ్మీర్‌లో 37 కేంద్ర చట్టాలు అమలుకానున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలోని ఈ చట్టాలను జమ్మూకాశ్మీర్‌లో అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ బుధవారం పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు.

02/26/2020 - 23:40

ముంబయి, ఫిబ్రవరి 26: షహీన్‌బాగ్ సంఘటన ముమ్మాటికీ భద్రతా వైఫల్యమేనని ఎన్‌సీపీ పార్లమెంటు సభ్యురాలు సుప్రియ సూలే ధ్వజమెత్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అసమర్థత వల్లే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నదని ఆమె విమర్శించారు. ఇప్పటి వరకు ఢిల్లీలో జరిగిన ఎన్‌సీఏ వ్యతిరేక ప్రదర్శనలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో సుమారు 20 మంది మృతి చెందారని ఆమె అన్నారు.

02/26/2020 - 04:37

న్యూఢిల్లీ: తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని భారతీయ పారిశ్రామికవేత్తలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇందుకు వీలుగా అన్నిరకాలుగానూ నియమనిబంధనలను సడలిస్తామని మంగళవారంనాడు ఇక్కడ జరిగిన సీఈఓల రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రకటించారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా బలోపేతం చేసుకోవడానికి విస్తృతంగా విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరుస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

,
02/26/2020 - 04:34

*చిత్రాలు.. .భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియా
*రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళి అర్పిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆయన భార్య మెలానియా

02/26/2020 - 04:49

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 25 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలలో ఎదురులేని శక్తిగా ఎదిగిన ఇస్రో అదే స్ఫూర్తితో ఇప్పుడు జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌పై దృష్టి పెట్టింది. బరువైన ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లే సామర్ధ్యం కలిగిన జీఎస్‌ఎల్‌వీ అంతరిక్ష వాహన నౌకలలో స్వీయ పరిజ్ఞానాన్ని సాధించిన ఇస్రో ఇప్పుడు ఆ ప్రయోగాల పరంపరపై గురిపెట్టింది.

02/26/2020 - 01:36

*చిత్రం... ఢిల్లీలో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కరచాలనం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు

02/26/2020 - 01:08

న్యూఢిల్లీ: ‘పౌరసత్వ సవరణ చట్టంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించలేదు..’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన ప్రజలకు ఏది మంచిదనేది భారత దేశం చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించగలిగే సమర్థత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్నదని, ఆయన గట్టి నాయకుడని, ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాలనే గట్టి పట్టుదలతో ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

02/26/2020 - 01:03

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి తీసుకునిపోవాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో హైదరాబాద్ హౌజ్‌లో పలు అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరిపిన అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు.

02/26/2020 - 00:46

న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నగారా మోగింది. మహారాష్టల్రోనే కాకుండా జాతీయ రాజకీయాలు, ముఖ్యంగా ప్రతిపక్షంలో రాజకీయాల చక్రం తిప్పే సీనియర్ మరాఠా నాయకుడు శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు కేవీపీ రామచందర్ రావు, కే కేశవరావు, టీ సుబ్బరామి రెడ్డి, ఎంఏ ఖాన్ తదితర ముఖ్యులు రిటైర్ అవుతున్నారు.

02/26/2020 - 00:45

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చత్తీస్‌గడ్ లేదా మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రియాంకను రాజ్యసభకు పంపించే అంశం ప్రస్తుతం సోనియా పరిశీలనలో ఉన్నదని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ ఆమోదించే పక్షంలో ప్రియాంక చత్తీస్‌గడ్ నుంచి రాజ్యసభకు వెళతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Pages