S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/24/2020 - 02:02

న్యూఢిల్లీ: జీవవైవిద్యం యావత్ మానవాళికి ఓ అద్భుతమైన సంపద అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన జీవ వైవిద్య సంపదను రక్షించుకోవాలని, అలాగే పరిరక్షించుకోవాలని ఆదివారం జాతినుద్దేశించి చేసిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో మోదీ స్పష్టం చేశారు.

02/24/2020 - 01:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ప్రజలలో కాంగ్రెస్ పార్టీ దిక్కూమొక్కూ లేని అసహాయ స్థితిలో ఉందనే భావన అంతకంతకూ పెరుగుతోందని, దీనినుంచి బయటపడటానికి పార్టీ నాయకత్వ సమస్యలకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించుకోవాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు.

02/24/2020 - 01:58

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఆదివారం పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేకుల మధ్య తీవ్ర స్థాయిలో జరిగిన ఘర్షణలతో అట్టుడుకింది. ఈశాన్య ఢిల్లీలోని జప్రాబాద్‌లో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. అలాగే ఓ మెట్రో స్టేషన్ గేట్లను కూడా మూసి వేశారు. శనివారం సాయంత్రం నుంచి ఆందోళనకారులు ముఖ్యంగా మహిళలు మెట్రో స్టేషన్‌ను దిగ్బందం చేశారు.

02/24/2020 - 01:56

అలీగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్), ఫిబ్రవరి 23: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ పాత నగరంలో ఆదివారం సాయంత్రం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులు ఆస్తుల దహనానికి, రాళ్లు రువ్వడానికి పాల్పడటంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారని అధికారులు తెలిపారు.

02/24/2020 - 01:53

*చిత్రం...ముంబయి జుహూ బీచ్‌లో వెలసిన డొనాల్డ్ ట్రంప్- నరేంద్ర మోదీ సైకత శిల్పం. దీన్ని సైకత చిత్ర కారుడు లక్ష్మీగౌడ్ సృష్టించారు

02/24/2020 - 04:32

ముంబయి: 2020 సంవత్సరానికి ‘లివా మిస్ దివా యూరివర్స్’ కిరీటాన్ని మంగళూరుకు చెందిన అడ్లిన్ కేస్టెలినో కైవసం చేసుకుంది. ఇక్కడి వైఆర్‌ఎఫ్ స్టూడియోస్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో గత పోటీల విజేత వర్టికా సింగ్ కేస్టెలినోకు మకుట ధారణ చేసింది. జబల్‌పూర్‌కు చెందిన ఆవ్రితి చౌదరి ఈ పోటీల్లో కేస్టెలినోకు చేరువగా వచ్చింది. చివరికి మిస్ దివా సూపర్‌నేషనల్ టైటిల్‌ను దక్కించుకుంది.

02/24/2020 - 00:56

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: భారత్-అమెరికాల వ్యూహాత్మక బంధం మరో మైలురాయిని అధిగమించబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నుంచి భారత్‌లో జరపనున్న రెండు రోజుల చారిత్రక పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక రక్షణ బంధాన్ని వ్యూహాత్మక రీతిలో మలుపుతిప్పే అవకాశం కనిపిస్తోంది.

02/23/2020 - 04:35

హూస్టన్: భారత్-అమెరికా మధ్య బలమైన మైత్రీ బంధాన్ని పెంపొందించడంలో ‘హౌడీ-మోడీ’ తరహాలోనే ‘నమస్తే ట్రంప్’ కూడా విజయవంతం కాగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో హౌడీ మోడీ కార్యక్రమాన్ని నిర్వహించిన బృందం ట్రంప్ భార త్ పర్యటన సందర్భంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం కూడా విజయవంతం కావాలని స్పష్టం చేసింది.

02/23/2020 - 04:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, దేశ ప్రయోజనాలను చాటిచెప్పే ప్రయత్నం చేయాలని బీజేపీ స్పష్టం చేసింది. ట్రంప్ పర్యటనపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను శనివారం నాడు ఇక్కడ తిప్పికొట్టింది.

02/23/2020 - 04:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: జాజ్వల్యమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఘన కీర్తులు అందుకుంటోందంటే అందుకు కారణం స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషేనని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. భారత్‌మాతాకీ జై వంటి నినాదాలు భావోద్వేగపూరితమైనవేనని శనివారంనాడు ఇక్కడ ‘నెహ్రూ కృషి-ప్రసంగాలు’పై ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అన్నారు.

Pages